Pumpkin : గుమ్మడికాయ పువ్వులు పుష్కల పోషక గుణాలు కలిగి ఉండి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. వీటిలో విటమిన్ A, విటమిన్ C, కాల్షియం, ఇనుము వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండి అలసటను తగ్గించడంలో, శరీరానికి శక్తిని అందించడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయని సూచించారు.
Pumpkin Seeds and Flowers Interesting Benefits
నిపుణుల ప్రకారం, గుమ్మడికాయ (Pumpkin) పువ్వులను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల అలసట, బలహీనత తగ్గుతుందని చెప్పారు. అలాగే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు. పిల్లలలో కంటి చూపును బలపరచడంలో గుమ్మడికాయ పువ్వు విటమిన్ A ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.
చర్మ సంరక్షణలో కూడా ఈ పువ్వులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఔషధ గుణాలు మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతం చేస్తాయని, ఆయుర్వేదం దీనిని సహజ చర్మ టానిక్‌గా అభివర్ణిస్తుందని తెలిపారు. గుమ్మడికాయ పువ్వుతో తయారయ్యే వంటకాలు పిల్లలు, వృద్ధులకు సమానంగా బలం అందిస్తాయని, ఇందులోని పోషకాలు శరీర శక్తిని పెంపొందిస్తాయని చెప్పారు.
అదనంగా, గుమ్మడికాయ పువ్వులు ఆర్థరైటిస్, కండరాల నొప్పులను తగ్గించడంలో సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తాయని నిపుణులు వెల్లడించారు. మహిళలకు ఇది మరింత ప్రయోజనకరమని, రుతుక్రమ సమస్యలను సవరించడంలో, ఎముకలను బలపరచడంలో సహాయపడుతుందని వివరించారు. ఇందులో ఉండే కాల్షియం, ఇనుము మహిళల ఆరోగ్యానికి ప్రత్యేకంగా మేలు చేస్తాయని సూచించారు.
Also Read : CCPA Shocking to FirstCry : ఫస్ట్ క్రై సంస్థకు దిమ్మతిరిగే షాకిచ్చిన సిసిపిఏ



















