Nobel Prize : హంగేరీ : ప్రపంచ సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ సాహిత్య పురస్కారం (Nobel Prize) ఈ ఏడాది హంగేరీకి చెందిన అత్యంత ముఖ్యమైన, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సమకాలీన రచయితలలో ఒకరైన లాస్లో క్రాస్నహోర్కై ని వరించింది . ఆయన రాసిన నవలలు, కథానికలు తరచుగా విపత్కర, నిరాశా పూరితమైన వాతావరణాన్ని, మానవ సమాజంలోని పతనాన్ని చిత్రిస్తాయి. 2015 లో ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ లభించింది. 2025లో ఆయన సాహితీ కృషికి గాను నోబెల్ బహుమతి లభించింది. 1954, జనవరి 5న హంగేరీలోని జ్యులా అనే చిన్న పట్టణంలో జన్మించారు. సెగెడ్, బుడాపెస్ట్ విశ్వ విద్యాలయాలలో న్యాయశాస్త్రం, హంగేరియన్ భాష, సాహిత్యం అభ్యసించారు. కొంతకాలం సంపాదకుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1984 నుండి పూర్తికాల రచయితగా మారారు.
Nobel Prize Winner Updates
ఆయన తన రచనల కోసం తరచుగా ప్రయాణం చేశారు. ముఖ్యంగా మంగోలియా, చైనా, జపాన్ వంటి తూర్పు దేశాలకు వెళ్లడం ఆయన రచనా శైలిపై, సౌందర్య దృష్టిపై ప్రభావం చూపింది. న్యూయార్క్‌లో కూడా కొంతకాలం గడిపారు. ప్రస్తుతం హంగేరీలోని స్జెంట్లస్లో కొండ ప్రాంతాలలో ఏకాంతంగా నివసిస్తున్నారు. క్రాస్నహోర్కై సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఆయన శైలి చాలా విశిష్టమైనది. ఆయన అనేక నవలలు, కథానికల సంకలనాలు, వ్యాసాలను రచించారు. సాతాన్ త్యాంగో ఇది ఆయన తొలి, అత్యంత ప్రసిద్ధ నవల. హంగేరీలోని ఒక పతనమవుతున్న గ్రామంలో నిరాశ, ద్రోహం, నిస్సహాయత నేపథ్యంలో సాగే కథ. ప్రముఖ హంగేరియన్ దర్శకుడు బేలా తార్ ఈ నవల ఆధారంగా 7 గంటల నిడివి గల ప్రయోగాత్మక చలన చిత్రాన్ని నిర్మించారు. ఆయనకు ఎన్నో అవార్డులు, పురస్కారాలు దక్కాయి.
Also Read : Minister Savitha Clear Instructions on GST : జీఎస్టీ సంస్కరణ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి


















