స్పాన్సర్షిప్ లేకుండా ఏ ఈవెంట్ స‌క్సెస్ కాదు

మెస్సీ ఈవెంట్ ఆర్గనైజర్ పార్వతీ రెడ్డి ప్ర‌క‌ట‌న

hellotelugu-PaarvathiReddy

హైద‌రాబాద్ : ప్ర‌పంచ ఫుట్ బాల్ దిగ్గ‌జ ఆట‌గాడు లియోనెల్ మెస్సీ ఇండియా ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా హైద‌రాబాద్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా త‌న ప‌ర్య‌ట‌న‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. భారీ ఎత్తున ఖ‌ర్చు చేశార‌ని, ఇందుకు సంబంధించి ఎలాంటి వివ‌రాలు ఎందుకు వెల్ల‌డించ లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మెస్సీ టూర్ కు సంబంధించి ఈవెంట్ ను ఆర్గ‌నైజ్ చేసిన ఈవెంట్ మేనేజ‌ర్ పార్వ‌తి రెడ్డి స్పందించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్పాన్సర్షిప్ లేకుండా ఏ ఈవెంట్ ని ఎవరూ విజయవంతంగా చేయలేరని స్ప‌ష్టం చేశారు.

లియెనెల్ మెస్సీ ఈవెంట్ కి ఎవరెవరు స్పాన్సర్షిప్ చేశారో వారందరి పేర్లని లిస్టులో పెట్టామ‌ని చెప్పారు.
హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఎవరూ చేయనిది తాము చేసి చూపించామ‌ని అన్నారు. దీనిని బిగ్ స‌క్సెస్ చేశామ‌ని తెలిపారు పార్వ‌తీ రెడ్డి. అంతే కాదు ఉప్పల్ స్టేడియంలో పూర్తి స్థాయిలో లేజర్ షో మేమే ఫస్ట్ నిర్వహించడం జ‌రిగింద‌ని అన్నారు. ఈ ఈవెంట్ సక్సెస్ కావడంతో హైదరాబాద్ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయి పోయింద‌ని పేర్కొన్నారు. దీని వ‌ల్ల న‌గ‌రానికి పెట్టుబడులు వస్తాయని, ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని చెప్పారు పార్వ‌తి రెడ్డి. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Exit mobile version