న్యూఢిల్లీ : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. తను సీఈసీగా కొలువు తీరాక తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రధానంగా తను నిబద్దతతో వ్యవహరించడం లేదని మండిపడ్డారు లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, అమేథి ఎంపీ రాహుల్ గాంధీ. కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా పరివారానికి మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అంతే కాదు సీఈసీపై సంచలన ఆరోపణలు చేయడమే కాదు బహిరంగంగానే పక్కా ఆధారాలతో సహా బయట పెట్టారు. ఢిల్లీ కేంద్రంగా మీడియా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ తరుణంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలకు చెందిన పార్టీలన్నీ భగ్గుమన్నాయి. తాజాగా పార్లమెంట్ లోని లోక్ సభ, రాజ్యసభలో ఏకంగా సీఈసీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇందుకు సంబంధించి తనను తొలగించాలనే నోటీసుపై 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో 130 మంది లోక్ సభకు చెందిన ఎంపీలు ఉండగా , 63 మంది రాజ్యసభ సభ్యులు సంతకం చేసిన వారిలో ఉన్నారు. అయితే రూల్స్ ప్రకారం నోటీసు ఇవ్వాలంటే కనీసం 100 మంది లోక్ సభ ఎంపీలు, 50 మంది రాజ్యసభ సభ్యులు సంతకం చేయాల్సి ఉంటుంది. అవసరమైన దానికంటే ఎక్కువ మంది మద్దతు తెలియ చేయడం విస్తు పోయేలా చేసింది.
