విజ‌య్ హ‌జారే టోర్నీ మ్యాచ్ ల‌కు నో ఛాన్స్

బిగ్ షాక్ ఇచ్చిన క‌ర్ణాట‌క హోం శాఖ

hellotelugu-ChinnaswamyStadium

బెంగ‌ళూరు : బీసీసీఐకి బిగ్ షాక్ ఇచ్చింది క‌ర్ణాట‌క రాష్ట్ర హోం శాఖ‌. ఇవాల్టి నుంచి దేశీవాళి వ‌న్డే క్రికెట్ టోర్న‌మెంట్ ప్రారంభం కానుంది. దిగ్గ‌జ భార‌త జ‌ట్టుకు చెందిన ఆటగాళ్లు మ‌రోసారి స‌త్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌ను పుర‌స్క‌రించుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచ‌న‌ల మేర‌కు విజ‌య్ హజారే టోర్నీకి సంబంధించిన మ్యాచ్ ల‌ను నిర్వ‌హించేందుకు గాను బెంగ‌ళూరులోని చిన్న స్వామి స్టేడియంలో అనుమ‌తి ఇవ్వ‌డం లేదంటూ స్ప‌ష్టం చేశారు బెంగళూరు పోలీస్ క‌మిష‌న‌ర్ సీమంత్ కుమార్.

ఇప్ప‌టికే మ్యాచ్ ల‌కు సంబంధించి ఏర్పాటు చేసిన ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ కీల‌క సూచ‌న‌లు చేసింద‌ని తెలిపారు. బుధ‌వారం బెంగ‌ళూరులో సీపీ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ నిర్ణ‌యం తాము తీసుకున్న‌ది కాద‌ని స్ప‌ష్టం చేశారు. ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతులు ఇవ్వ‌డం లేదంటూ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను తాము స‌ర్కార్ కు అంద‌జేస్తామ‌ని తెలిపారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు మ్యాచ్ ల నిర్వ‌హ‌ణ అనేది కుద‌ర‌దంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

ఇదిలా ఉండ‌గా ప్రేక్ష‌కులు లేకుండా మ్యాచ్ లు నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని క‌ర్ణాట‌క స్టేట్ క్రికెట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్, మాజీ బౌల‌ర్ వెంకటేశ్ ప్ర‌సాద్ ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈ మేర‌కు హోం శాఖ మంత్రి ప‌ర‌మేశ్వ‌ర క‌మిటీని ఏర్పాటు చేశారు. క‌మిటీ త‌ను చేసిన ప్ర‌తిపాద‌న‌కు ఒప్పుకోలేదు.

Exit mobile version