బెంగళూరు : ఐపీఎల్ 19వ సీజన్ టైటిల్ విజేతగా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ వరుసగా రెండోసారి విజేతగా నిలవడం విశేషం. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను ఓడించింది . విరాట్ కోహ్లీ 42 బంతులు ఆడి 9 ఫోర్లు 3 సిక్సర్లతో 75 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. గుజరాత్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించారు. విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇదిలా ఉండగా గత ఏడాది కూడా గెలుపొందడంతో భారీ ర్యాలీ చేపట్టారు. పెద్ద ఎత్తున జనం చేరుకోవడంతో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత ఏడాది సంఘటనను ఆధారంగా చేసుకుని బెంగళూరు పోలీసులు కీలక ప్రకటన చేశారు. లా అండ్ ఆర్డర్ దృష్ట్యా ఈసారి టైటిల్ గెలుపొందిన సందర్బంగా విజయోత్సవ పరేడ్ ను నిర్వహించ వద్దని సూచించారు. అంతే కాదు దీని వల్ల ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని, అందువల్ల శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. అభిమానులు వీధుల్లో బహిరంగంగా సంబరాలు చేసుకోవద్దని, ముఖ్యంగా శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని ఆదేశాలు జారీ చేవారు. ఉద్వేగ భరితమైన అభిమానులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కాపాడుకున్నందుకు జట్టుతో కలిసి సంబరాలు చేసుకోలేరు. కొత్తగా నియమితులైన కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆర్‌సిబి ఈ నిర్ణయం తీసుకుంది.
