Nitish Kumar Victory Again : నితీష్ కుమార్ మ‌రోసారి సీఎం అవుతారు

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ప్ర‌క‌ట‌న

Hello Telugu - Nitish Kumar Victory Again

Hello Telugu - Nitish Kumar Victory Again

Nitish Kumar : బీహార్ : ఎల్జేపీ పార్టీ చీఫ్‌, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీహార్ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఏకంగా 203 సీట్ల‌ను కైవ‌సం చేసుకుని మ‌హా ఘ‌ట్ బంధ‌న్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ ఎన్నిక‌ల్లో గ‌తంలో కంటే ఎక్కువ సీట్ల‌ను త‌మ పార్టీ కైవ‌సం చేసుకోవ‌డం ప‌ట్ల స్పందించారు చిరాగ్ పాశ్వాన్. ముఖ్య‌మంత్రి ఎవ‌రు అవుతార‌నేది తాను చెప్ప‌డం స‌రి కాద‌న్నారు. రాజ్యాంగం నిర్దేశించినట్లుగా ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. నా నమ్మకం ప్రకారం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) మరోసారి ముఖ్యమంత్రి అవుతార‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

Nitish Kumar Victory

ఆదివారం పాట్నాంలో చిరాగ్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడారు. గ‌త కొన్నేళ్లుగా త‌నే సీఎంగా కొన‌సాగుతూ వ‌చ్చారు. రాష్ట్రానికి ఏం కావాలో నితీష్ జీకి తెలిసినంత‌గా ఇంకెవ్వ‌రికీ తెలియ‌ద‌న్నారు. కేంద్రంలో ఎన్డీయే స‌ర్కార్ ఉండ‌డం వ‌ల్ల అభివృద్దికి మ‌రింత ఊతం ఇవ్వ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ప్ర‌జ‌లు విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోర‌ని, కేవ‌లం త‌మ‌కు ఏం ఇస్తున్నార‌నేది చూస్తార‌ని ఆ విష‌యం రాహుల్ గాంధీ, తేజ‌స్వి యాద‌వ్ కు తెలియ‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. త‌మంత‌కు తాముగా ఎక్కువ‌గా ఊహించుకున్నార‌ని, కానీ ప్ర‌జ‌లు అమాయ‌కులు కాద‌ని, క‌ర్ర కాల్చి వాత పెట్టారంటూ ఎద్దేవా చేశారు చిరాగ్ పాశ్వాన్.

Also Read : Minister Gottipati Ravi Kumar Important Update : గ్రీన్ ఎనర్జీలో ఏపీకి భారీగా పెట్టుబడులు

Exit mobile version