Nitish Kumar Victory : బీహార్ లో నితీష్ కుమార్ బాద్ షా

మ‌రోసారి చ‌క్రం తిప్పిన ముఖ్య‌మంత్రి

Hello Telugu - Nitish Kumar Victory

Hello Telugu - Nitish Kumar Victory

Nitish Kumar : బీహార్ : మ‌రోసారి బీహార్ లో చ‌క్రం తిప్పారు ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar). ఎన్డీయే కూట‌మి భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. రాహుల్ గాంధీ, తేజ‌స్వి యాద‌వ్ పార్టీల‌తో కూడిన మ‌హా ఘ‌ట్ బంధ‌న్ బోల్తా ప‌డింది. విచిత్రం ఏమిటంటే బీహార్ లో నితీశ్ (Nitish Kumar) సుదీర్ఘ కాలం పాటు ప‌ని చేయ‌డం విశేషం. రాష్ట్ర‌, దేశ రాజ‌కీయాల‌లో కీల‌క‌మైన రాజ‌కీయ శ‌క్తిగా మారి పోయారు. గ‌తంలో కంటే ఎక్కువ స్థానాల‌ను సాధించే ప‌నిలో ఉంది ఎన్డీయే కూట‌మి. నితీశ్ కుమార్ అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం, వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం, చ‌త‌రుత‌, పాల‌నా ప‌ర‌మైన టెక్నిక్ గెలుపొంద‌డంలో దోహ‌ద ప‌డేలా చేశాయి. పోటీ ఎన్డీయే, మ‌హా ఘ‌ట్ బంధ‌న్ మ‌ధ్య హోరా హోరీగా ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ ముంద‌స్తుగా ప్ర‌క‌టించిన ఎగ్జిట్ పోల్స్ కంటే ఎక్కువ‌గా సీట్లు సాధించే ప‌నిలో ప‌డింది స‌ర్కార్.

Bihar CM Nitish Kumar Victory

నితీశ్ కుమార్ ఎవ‌రితో జ‌త క‌ట్టినా తాను కింగ్ మేక‌ర్ గా ఉండాల‌ని భావిస్తూ వ‌చ్చారు. ఆ మేర‌కు ప్ర‌య‌త్నాలు చేశారు. అందులో స‌క్సెస్ అయ్యారు. ఏపీలో చంద్ర‌బాబు బీహార్ లో నితీశ్ కుమార్ ఇద్ద‌రూ ఇప్పుడు కేంద్రంలో మోదీ స‌ర్కార్ కు ఆయువు ప‌ట్టుగా ఉన్నారు. ఇక్క‌డ మంత్రి నారా లోకేష్ కూడా ప్ర‌చారం చేశారు. ఇండియ‌న్ పాలిటిక్స్ లో సుదీర్ఘ‌మైన సీఎంగా ఉంటూ నితీశ్ కుమార్ చ‌రిత్ర సృష్టించారు. 2000 సంవ‌త్స‌రంలో సీఎం అయ్యారు. ఆనాటి నుండి బ‌హుళ సంకీర్ణ ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్రాన్ని న‌డిపిస్తూ వ‌చ్చారు. బీజేపీ, ఆర్జేడీ మ‌ధ్య పొత్తుల‌ను ప్ర‌త్యామ్నాయంగా మార్చ‌డంలో సక్సెస్ అయ్యారు. 1951లో భ‌క్తియార్ పూర్ లో పుట్టిన నితీశ్ కుమార్ 1970లో జేపీ ఉద్య‌మానికి ప్ర‌భావితం అయ్యారు. 1985లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. త‌న‌కు మ‌రో పేరు కూడా ఉంది అదే సుశాస‌న్ బాబు. త‌ను అనుకున్న‌ది సాధించాడు. కింగ్ మేక‌ర్ గా మారాడు.

Also Read : Adani Group Huge Investment in AP : ఏపీలో అదానీ గ్రూప్ రూ. ల‌క్ష కోట్లు ఇన్వెస్ట్

Exit mobile version