ఢిల్లీ : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్ రాష్ట్రానికి చెందిన మంత్రిగా కొలువు తీరిన నితిన్ నబిన్ కు ఛాన్స్ ఇచ్చారు. ఆయన నియామకానికి సంబంధించి స్పందించారు ప్రధానమంత్రి. తను దమ్మున్న లీడర్ అంటూ కితాబు ఇచ్చారు. రాజకీయ పరంగా, సంస్థాగత పరంగా అద్భుతమైన అనుభవం కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. తను వ్యూహాలు రచించడంలో, పార్టీని నడిపించడంలో కీలకమైన పాత్ర పోషిస్తాడని, అందుకే ఏరికోరి పార్టీ చీఫ్ గా బాధ్యతలు అధిష్టానం ముందుచూపుతో ఆలోచించి అప్పగించడం జరిగిందని చెప్పారు.
తను యువకుడు, పని పట్ల అంకిత భావం ఉందన్నారు. బీహార్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక పర్యాయాలు అద్భుతమైన రికార్డు ఉందని అందుకే తను పార్టీ చీఫ్ అయితే బాగుంటుందని భావించామన్నారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఇదిలా ఉండగా నితిన్ నబిన్ ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో రోడ్డు నిర్మాణ మంత్రిగా ఉన్నారు. 45 ఏళ్ల నబిన్ బిజెపి జాతీయ అధ్యక్షుడిగా అతి పిన్న వయస్కుడయ్యాడు. ఈ సందర్బంగా తన గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పార్టీ ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన శ్రద్ధగా పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా స్పందించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, సర్కార్ లో మంత్రిగా పని చేసిన అనుభవం పార్టీకి మరింత పనికొస్తుందన్నారు.
















