Important Update on E20 Petrol : E20 ఇంధనానికి నిస్సాన్ మాగ్నైట్ అనుకూలం – కంపెనీ అధికారిక ప్రకటన

ప్రభుత్వ స్థిరమైన భవిష్యత్తు లక్ష్యాలకు మద్దతుగా పనిచేస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

Hello Telugu - Important Update On E20 Petrol

Hello Telugu - Important Update On E20 Petrol

E20 Petrol : ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 ఇంధనం అందుబాటులోకి రావడంతో వాహన యజమానులు, తయారీదారులు దీనిపై చర్చలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిస్సాన్ మోటార్ ఇండియా తమ ఇంజిన్లు E20 ఇంధనానికి (E20 Petrol) పూర్తిగా అనుకూలమని ప్రకటించింది. పర్యావరణహిత ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడంలో, ప్రభుత్వ స్థిరమైన భవిష్యత్తు లక్ష్యాలకు మద్దతుగా పనిచేస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

E20 Petrol – నిస్సాన్ మాగ్నైట్ – ఇంజిన్ వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ మోడల్ 1.0-లీటర్ HR10 (NA), BR10 (టర్బో) పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తోంది. వీటన్నీ E20 ఇంధనానికి అనుకూలం.

E20 ఇంధనం అంటే ఏమిటి?

E20 అనేది 80% పెట్రోల్ + 20% ఇథనాల్ మిశ్రమ ఇంధనం.

వారంటీపై నిస్సాన్ హామీ

నిస్సాన్ ఇటీవలే 10 ఏళ్ల వారంటీ ప్రోగ్రామ్ను మాగ్నైట్ మోడళ్ల కోసం ప్రవేశపెట్టింది.

వినియోగదారుల ఆందోళనలు

పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల వాహనాల పనితీరు తగ్గుతుందేమోనని కొంతమంది వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు యజమానులు ఇంధన వినియోగం 15–20 శాతం తగ్గుతోందని పేర్కొన్నారు. అయితే, నిస్సాన్ మాత్రం ఇంధన మార్పు వల్ల ఎటువంటి పెద్ద సమస్యలు గమనించలేదని తెలిపింది.

Also Read : Stock Market Growth : ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతతో లాభాల్లో స్టాక్ మార్కెట్

Exit mobile version