NHRC : ఢిల్లీ : జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ కాలేజీల అక్రమాలపై మండిపడింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డీఎంఈ డైరెక్టర్, నర్సింగ్ కౌన్సిల్ రిజాస్ట్రార్ లను గురువారం ఆదేశించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉన్న నర్సింగ్ కళాశాలల అక్రమాలపై తరచుగా వస్తున్న పత్రిక కథనాలను ఆధారంగా చేసుకొని హైదరాబాద్ కు చెందిన న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) లో ఫిర్యాదు చేశారు. నర్సింగ్ కళాశాలలో సరైన వసతులు, అధ్యాపకులు లేకుండా మధ్యవర్తుల ద్వారా అక్రమంగా అధికారులకు లక్షల రూపాయల లంచాలు ఇచ్చి నడిపిస్తున్నారని వాపోయారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకుండా మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
NHRC Shocking
అదేవిధంగా ఒకచోట పర్మిషన్ తీసుకొని మరొక చోట కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఒకే బిల్డింగ్ లో 8 కళాశాలలను ఏర్పాటుకు అనుమతించారని తెలిపారు. ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని వాపోయారు. కేవలం షోకాజ్ నోటీసులు మాత్రమే జారీ చేసి చేతులు దులుపు కోవడం చేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి పూర్తి విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు విద్యా హక్కు ప్రకారం నాణ్యమైన విద్యను అందించే విధంగా చొరవ తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది రేవంత్ తెలిపారు. పూర్తి నివేదికను నాలుగు వారాల్లోపు జాతీయ మానవ హక్కుల సంఘానికి నివేదించాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read : VP JD Vance Shocking Comments on H-1B : హెచ్ -1బి వీసా జారీలో సంస్కరణలు అవసరం
