భారీ ధ‌ర‌కు ఛాంపియ‌న్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ స్వంతం

ప్ర‌దీప్ అద్వైతం ద‌ర్శ‌క‌త్వం , మిక్కీ సంగీతం

hellotelugu-ChampionOtt

హైద‌రాబాద్ : ఎవ‌రూ ఊహించ‌ని ధ‌రకు కైవ‌సం చేసుకుంది టాప్ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. ప్ర‌దీప్ అద్వైతం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ఛాంపియన్ ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. స్వప్న సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈనెల 25వ తేదీన విడుద‌ల‌య్యేందుకు సిద్ద‌మైంది ఈ మూవీ. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్, సాంగ్స్ కెవ్వుకేక అనిపించేలా ఉన్నాయి. ప్ర‌ధానంగా తెలంగాణకు చెందిన కాస‌ర్ల శ్యామ్ రాసిన గిర గిర పాట ఇప్పుడు ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. రికార్డుల మోత మోగిస్తోంది. ఇక మిక్కీ జే మేయ‌ర్ అందించిన స్వ‌రాలు గుండెల‌ను తాకేలా ఉన్నాయి. ఇక సినిమా కూడా రిచ్ గా ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది.

మ‌రో వైపు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీ న‌టులు, ద‌ర్శ‌కులు సైతం ఛాంపియ‌న్ చిత్రాన్ని ప్ర‌మోట్ చేస్తున్నారు. దీంతో సినిమాపై భారీ హైప్ నెల‌కొంది. ఇందులో న‌టించిన రోష‌న్ ఎవ‌రో కాదు ప్ర‌ముఖ న‌టుడు శ్రీ‌కాంత్, హేమ ముద్దుల త‌న‌యుడు. గ‌తంలో ఓ సినిమాలో న‌టించాడు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. దాదాపు మూడు సంవ‌త్స‌రాల గ్యాప్ తీసుకున్నాడు. ప్ర‌స్తుతం ఛాంపియ‌న్ తో త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. ఈ సినిమాను అద్భుతంగా తీశాడు ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ అద్వైతం. నటుడు నాని, కల్కి 2898 AD దర్శకుడు నాగ్ అశ్విన్, యానిమల్ చిత్ర నిర్మాత సందీప్ రెడ్డి వంగా తమదైన రీతిలో ఈ చిత్రానికి మద్దతు ఇచ్చారు. అనస్వర రాజన్ కథానాయికగా నటించింది.

https://www.youtube.com/watch?v=VXSK2S8Aq0Q

Exit mobile version