ఉపాధి హామీ ప‌థ‌కం ప‌ట్ల నిర్ల‌క్ష్యం త‌గదు

కేంద్ర స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న ష‌ర్మిలా రెడ్డి

hellotelugu-YSSharmila

అమ‌రావ‌తి : కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. జాతీయ ఉపాధి హామీ ప‌థకాన్ని కావాల‌ని నిర్వీర్యం చేసిన ఘ‌న‌త ప్ర‌ధాని మోదీకి ద‌క్కుతుంద‌న్నారు. కేవ‌లం బ‌డా బాబులు, కార్పొరేట్ కంపెనీల‌కు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంట‌న్నార‌ని ఆరోపించారు . శుక్ర‌వారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర గుంటూరు జిల్లాలో సాగింది. మహానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు ష‌ర్మిలా రెడ్డి.

అనంతరం తెనాలి పట్టణంలో రచ్చబండ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజక వర్గ ప్రజల నుంచి అశేష స్పందన లభించింది. గ్రామీణాభివృద్ధిలో కాంగ్రెస్ తీసుకొచ్చిన మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టం పాత్రను వివరించారు. ప్రధాని మోడీ తెచ్చిన VB G- RAM G పథకం వలన జరిగే నష్టంపై అవగాహన కల్పించారు ష‌ర్మిలా రెడ్డి. మన్రేగా ద్వారా 100 రోజులు పాటు పని హక్కుగా మారిందని, వలసలు తగ్గాయని, ఇదే ఉపాధి హామీ చట్టాన్ని గాంధీజీ పేరుతోనే మళ్లీ కొనసాగించాలని శ్రామికుల నుంచి డిమాండ్ వ్యక్తమైంది.

ఈ 11 ఏళ్ల మోదీ పాల‌నా కాలంలో దేశానికి ఒరిగింది ఏమీ లేద‌న్నారు. కేవ‌లం ప‌న్నుల మోత‌, ఇబ్బందులు త‌ప్ప అని ఎద్దేవా చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. కేవ‌లం పేద‌లు, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమానికి తూట్లు పొడిచేలా ఈ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేశార‌ని ఆరోపించారు.

Exit mobile version