జూన్ 21న నీట్ – యుజి 2026 ప‌రీక్ష

ప్ర‌క‌టించిన నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ

Hllotelugu-NEET-UG2026

ఢిల్లీ : కేంద్ర స‌ర్కార్ ఆదేశాల మేర‌కు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే మే 3వ తేదీన నిర్వ‌హించిన నీట్ -యుజి 2026 ప‌రీక్ష పేప‌ర్లు లీక్ అయ్యాయి. ఇందులో కీల‌క పాత్ర పోషించిన‌ట్లు బీజేపీకి చెందిన ఒక‌రు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై కేంద్రం స్పందించింది. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐకి విచార‌ణ నిమిత్తం ఏర్పాటు చేసింది. దీంతో ఈ నిర్వాకం కార‌ణంగా దేశ వ్యాప్తంగా 22 ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా న‌ష్ట పోయారు. తిరిగి వీరంతా ప‌రీక్ష‌ను రాయాల్సి ఉంది. ఇప్ప‌టికే ఎన్టీఏ తిరిగి ప‌రీక్ష చేప‌డ‌తామ‌ని తెలిపింది. ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది. శుక్ర‌వారం ఇందుకు సంబంధించి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. నీట్ యుజి 2026 ప‌రీక్ష‌ను జూన్ 21వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

మ‌రో వైపు పేపర్ లీక్‌ల ఆరోపణల కారణంగా వైద్య ప్రవేశ పరీక్ష రద్దు అయిన దాదాపు రెండు వారాల తర్వాత ఎన్టీఏ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పింది. భారత ప్రభుత్వ ఆమోదంతో ప‌రీక్ష‌ను ఆదివారం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు, తల్లిదండ్రులు కేవలం అధికారిక సమాచార మార్గాలపై మాత్రమే ఆధారపడాలని ఏజెన్సీ కోరింది. సురక్షితమైన, పారదర్శకమైన , విశ్వసనీయమైన పద్ధతిలో పునః పరీక్షను నిర్వహించే విధి విధానాలపై చర్చించడానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన సీనియర్ అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

ఈ సమావేశానికి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్, ఎన్‌టిఎ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, సిబిఎస్‌ఇ ఛైర్‌పర్సన్ రాహుల్ సింగ్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ , నవోదయ విద్యాలయ సమితికి చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు. పేపర్ లీక్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మే 3న జరగాల్సిన నీట్-యుజి 2026 పరీక్షను మే 12న ఎన్‌టిఎ రద్దు చేసింది.

Exit mobile version