హైదరాబాద్ : టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం మన శివ శంకర వర ప్రసాద్ గారు చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది ఈ మూవీకి సంబంధించి. దసరా పండుగను పురస్కరించుకుని చిత్రంలో కీలక పాత్ర పోషించిన స్టార్ హీరోయిన్ నయనతార ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పటికే చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము రేపింది. ఫస్ల్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉంది. ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంక్రాంతికి విడుదలై దుమ్ము రేపింది. ఏకంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది. ఇందులో విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్ , మీనాక్షి చౌదరి నటించారు. కామెడీ, వినోదం దెబ్బకు జనం ఫుల్ ఆదరించారు. కాసుల వర్షం కురిపించారు. ఇక అనిల్ రావిపూడి తీసిన ప్రతి మూవీ సెన్సేషన్ హిట్స్ గా నిలిచాయి. తను రవితేజ, మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు.
ఇక మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలో శశిరేఖగా నయనతార నటించింది. ఈ పోస్టర్లో నయనతార పూర్తిగా సాంప్రదాయ ఆభరణాలతో పసుపు రంగు చీరలో కనిపించింది. ఈ నేపథ్యంలో పండుగ అలంకరణలతో నల్లటి హ్యాండిల్ గొడుగును పట్టుకుంది. ఆమె పాత్ర సినిమా కథాంశానికి కీలకమని ఈ చిత్రాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని అర్చన సమర్పిస్తున్నారు. విజయ దశమి సందర్భంగా రేపు ప్రత్యేక ప్రకటనను మేకర్స్ ప్లాన్ చేశారు. ఇదిలా ఉండగా చిరంజీవి ఫస్ట్ లుక్‌ను బృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు.


















