Nayanthara : తమిళ సినీ స్టార్ హీరోయన్, లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు పొందిన నయనతార (Nayanthara) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను , తన భర్త విఘ్నేష్ శివన్ తో విడి పోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా తిప్పికొట్టారు. ఈ అంశం పూర్తిగా అబద్దమని పేర్కొంది. బ్రేకప్ పుకార్లకు తెర దించింది. తను గతంలో పలువురు హీరోలతో టచ్ లో ఉందన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఊహించని రీతిలో విఘ్నేష్ శివన్ తో పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ కవల పిల్లలు పుట్టారు. ఈ సందర్బంగా స్పందిస్తూ తమను ఏ శక్తి విడదీయలేదని స్పష్టం చేసింది నయన్.
Nayanthara Comments
తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో పంచుకుంది. తన భర్త శివన్ తో ఉల్లాసమైన ఫోటోను షేర్ చేసింది. ఇది సోషల్ మీడియాను షేక్ చేసింది. తమ ఉరించి వెర్రి వార్తలు చూసినప్పుడు తనకు మరింత ఆనందంగా ఉందని తెలిపింది. ఇదే సమయంలో నయన్ ఆ మధ్యన ఓ కామెంట్ చేసింది. మీరు తక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆ పెళ్లి పెద్ద తప్పు అవుతుంది… మీ కారణంగా నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను అని పేర్కొంది. ఆ వెంటనే సదరు పోస్ట్ ను తొలగించింది నయనతార.
ఈ పోస్ట్ గాసిప్స్ మరింత పెరిగేందుకు, కామెంట్స్ చేసేందుకు ఆజ్యం పోసిందని చెప్పక తప్పదు. అయితే, నయనతార ఎప్పుడూ అలాంటి సందేశాన్ని పోస్ట్ చేయలేదని, ఇది అల్లరి చేసేవారు వ్యాప్తి చేసిన నకిలీ పోస్ట్ అని ఆ జంటకు సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. తామిద్దరి మధ్య ఎలాంటి భేదాలు లేవు. అంతకు మించిన ప్రేమ దాగి ఉందని నయన్ పేర్కొంది.
Also Read : Mamitha Baiju Shocking Pooja : పూజా హెగ్డేకు బిగ్ షాక్ మమిత బైజు ఎంటర్



















