Nayanthara : నిత్యం వార్తల్లో ఉంటూ మరింత పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది తమిళ సినీ నటి నయనతార. తను ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న కొత్త మూవీలో కన్ ఫర్మ్ అయ్యింది. షూటింగ్ లో బిజీగా గడుపుతోంది. ఆ మధ్యన ఇందుకు సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేసింది. తాజా దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది నయన తార (Nayanthara) చేసిన కామెంట్స్. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ మరింత అనుమానం రేకెత్తించేలా చేసింది.
Nayanthara Shocking Comments
తను గతంలో ప్రముఖ తమిళ సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పెళ్లి చేసుకుంది. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది ఈ లవ్లీ బ్యూటీ. అయినా ఎక్కడా తగ్గడం లేదు. తను బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో నటించింది. కొంత కాలంగా శివన్, నయన్ కలిసి తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచచేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇటీవల కొన్ని రోజుల నుంచి తమ కుమారుల ఫోటోలను పోస్ట్ చేయడం వైరల్ గా మారాయి.
వివాహం అనేది జీవితంలో మరిచి పోలేని అంశం. అదో అద్భుతమైన బంధం. ప్రత్యేకించి మాతృత్వం అనేది దేవుడు ఇచ్చిన వరం. కానీ ఈ పెళ్లి అనేది ఇద్దరి మధ్య కొనసాగే రిలేషన్ షిప్. ఇదే సమయంలో ఏ మాత్రం అవగాహన కలిగి ఉండక పోతే ఇబ్బంది పడే ప్రమాదం ఉందంటూ పేర్కొంది. తన భర్త శివన్ గురించి ప్రత్యేకంగా కామెంట్స్ చేయడం కలకలం రేపింది. మీరు ఒక తెలివి తక్కువ వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు వివాహం ఒక తప్పు. పురుషులు సాధారణంగా పెద్దవారు కానందున మీరు మీ భర్త చర్యలకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదంటూ పేర్కొంది నయనతార.
Also Read : Ramayana Movie Glimpse Sensational : రణబీర్ కపూర్, సాయిపల్లవి నటిస్తున్న ‘రామాయణ’ గ్లింప్స్ వచ్చేసింది

















