సినిమా ప్ర‌మోష‌న్ లో న‌య‌న‌తార బిజీ

మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి కీ రోల్

hellotelugu-NayantaraAnilRavipudi

హైద‌రాబాద్ : కొత్త ఏడాదిలో సంక్రాంతి పండుగ‌కు ఫుల్ మీల్స్ ఇవ్వ‌బోతోంది తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌. కొత్త‌గా తీసిన సినిమాల‌లో కొన్ని ఫెస్టివ‌ల్ సంద‌ర్బంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. తాజాగా బ‌హు భాషా న‌టిగా గుర్తింపు పొందిన త‌మిళ చ‌ల‌న చిత్రసీమ‌లో టాప్ లో కొన‌సాగుతోంది న‌య‌న‌తార‌. త‌నకు ఫెళ్లి కూడా అయ్యింది. ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌లు. కానీ ఎక్క‌డా ఆ గ్యాప్ రానీయ‌కుండా మూవీస్ పై ఫోక‌స్ పెట్టింది. ఆ మ‌ధ్య‌న అట్లీ తీసిన జ‌వాన్ మూవీలో షారుక్ ఖాన్ తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇదే క్ర‌మంలో టాలీవుడ్ లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన సినిమాలు తీసిన దర్శ‌కుడిగా గుర్తింపు పొందాడు అనిల్ రావిపూడి. త‌న ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, విక్ట‌రీ వెంక‌టేష్ , ర‌వితేజ లాంటి న‌టుల‌తో సినిమాలు తీశాడు.

తీసిన ప్ర‌తి మూవీ కూడా బిగ్ హిట్ గా నిలిచిచింది. మ‌హేష్ బాబుతో తీసిన మూవీ కూడా సూప‌ర్ సక్సెస్. గ‌త ఏడాది త‌ను వెంకీతో తీసిన సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. రూ.300 కోట్లు వ‌సూలు చేసింది . తాజాగా చిరంజీవి, న‌య‌న‌తార‌తో క‌లిసి మ‌న శంక‌ర ప్ర‌సాద్ గారు మూవీ తీశాడు. ఇందుకు సంబంధించిన పాట‌లు దుమ్ము రేపుతున్నాయి. టాప్ లో కొన‌సాగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా ఈనెల‌లోనే సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు హ‌ర్షాతిరేక‌ల మ‌ధ్య‌. ఇందులో భాగంగా సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం స్పీడ్ పెంచారు. న‌టి న‌య‌న తార‌, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి స్వ‌యంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ఇద్ద‌రి క్యాంపెయిన్ తో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

Exit mobile version