‘టాక్సిక్’ మూవీ ప్ర‌చారంపై న‌య‌న‌తార ఫోక‌స్

గ‌తంలో ప్ర‌చారానికి దూరంగా ఉన్న న‌టి

hellotelugu-Naanatara

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన , అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టిగా, లేడీ అమితాబ్ బ‌చ్చ‌న్ గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార సంచ‌ల‌నంగా మారారు. ఆమె గ‌తంలో ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌లో న‌టించారు. అయితే ఎక్క‌డా ఆయా మూవీస్ కు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌లేదు. త‌న‌కు ఎక్కువ‌గా ఇష్టం ఉండ‌దంటూ గ‌తంలో బోల్డ్ ప్ర‌క‌ట‌న కూడా చేసింది. కానీ తాజాగా గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ టాక్సిక్ లో న‌య‌న్ కీల‌క పాత్ర పోషించింది. త‌న‌తో పాటు మ‌రికొంత మంది అందాల తార‌లు ఇందులో న‌టించారు. అయితే గ‌తంలో చేసిన ప్ర‌క‌ట‌న‌కు భిన్నంగా టాక్సిక్ మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతోంది న‌య‌న‌తారు. దీనిపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. దీని గురించి నయనతార మాట్లాడుతూ ప్రచార కార్యక్రమాలకు హాజరు కావడం నాకు ఇష్టం లేదని కాదు. కాకపోతే ఆ విషయంలో నేను అంతగా ప్రావీణ్యం కలిగి ఉండను, అందుకే వాటికి దూరంగా ఉంటానంటూ పేర్కొంది.

కానీ ఈ కార్యక్రమం చాలా కారణాల వల్ల ప్రత్యేకమైనది. ముఖ్యంగా యష్ వల్లే ఇది సాధ్యమైంది. ఆయన ఒక్క ఫోన్ కాల్ చేయగానే, నేను ఆ కార్యక్రమానికి హాజరవ్వడానికి అది సరిపోయింది అని అన్నారు న‌య‌న‌తార‌. గతంలో ఆమె కొన్ని టాలీవుడ్ కార్యక్రమాలకు హాజరు కాలేదు. ఇటీవల వచ్చిన తన తెలుగు చిత్రం మన శంకర వరప్రసాద్ గారు కోసం దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఒక వీడియోలో కనిపించినప్పటికీ, మెగాస్టార్ చిరంజీవితో జరిగిన భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఆమె హాజరు కాలేదు. ప్ర‌స్తుతం యష్ నటించిన ‘టాక్సిక్’ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం బెంగళూరులో ఘనంగా జరిగింది. సాధారణంగా ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండే నయనతార అక్కడ కనిపించడం అందరినీ ఆశ్చర్య పోయేలా చేసింది. ఈ సినిమా త్వ‌ర‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Exit mobile version