అమరావతి : కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా అమరావతి క్వాంటం బయో వ్యాలీకి జాతీయ గుర్తింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నడ్డాను కోరారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన చేసిన సూచనకు సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి. ఆయన చేసిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు .అంతే కాకుండా క్వాంటం బయో వ్యాలీపై చర్చించేందుకు కేంద్రం నుంచి టెక్నికల్ బృందాన్ని అమరావతికి పంపుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంజీవని కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో అమలుపై ఆలోచిస్తామని కూడా భరోసా ఇచ్చారు. కిచెనే ఫార్మసీ-ఆహారమే ఔషధం అనే చంద్రబాబు కామెంట్లను తన ప్రసంగంలో పదే పదే ప్రస్తావించారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులపై చంద్రబాబు చిత్తశుద్ధిని కొనియాడారు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా. అమరావతి క్వాంటం బయో వ్యాలీ అభివృద్ధికి కేంద్రం నుంచి తప్పకుండా సహకారం ఉంటుందన్నారు. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలో క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటు చేయాలనే సీఎం చంద్రబాబు ఆలోచన బాగుందని కొనియాడారు. దీనిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు జేపీ నడ్డా. దీన్ని జాతీయ స్థాయిలో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తాం అన్నారు. సీఎం చంద్రబాబు సారధ్యంలో ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు విజన్-నిబద్దత కలిగిన నాయకుడు అని ప్రశంసించారు. ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర మరువలేం అన్నారు. కిచెనే ఫార్మసీ-ఆహారమే ఔషధం అనే చంద్రబాబు మాటలు నూటికి నూరు శాతం నిజం అని స్పష్టం చేశారు. ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇదే మూల సూత్రం అని పేర్కొన్నారు జేపీ నడ్డా.

















