Minister Nara Lokesh Strong Focus : ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకరించండి

కేంద్ర మంత్రి జైశంకర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ

Hello Telugu - Minister Nara Lokesh Strong Focus

Hello Telugu - Minister Nara Lokesh Strong Focus

Nara Lokesh : న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S jaishankar) తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ… విశాఖపట్నంలో డాటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని చెప్పారు, దీనికి సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాల‌ని కోరారు. సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల‌న్నారు.

IT Minister Nara Lokesh Request

ఆంధ్రప్రదేశ్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలకు నిరంతరం సహకారం అందించాల‌ని కోరారు. వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులతో పాటు నిధులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు.. వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి కి సింగపూర్ ప్రభుత్వం తో జరిగిన చర్చల గురించి లోకేష్ వివరించారు. దీనికి మీ పూర్తి సహకారం కావాలని లోకేష్ జైశంకర్ ను కోరారు.

ఏపీకి చెందిన సుమారు 35 లక్షల మంది ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారని తెలిపారు. అమెరికాలో 10 లక్షలు, గల్ఫ్ దేశాల్లో 8 లక్షలు, ఐరోపా దేశాల్లో 4 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారన‌నారు. యుఎస్ లో అక్కడ ప్రజల తలసరి ఆదాయం 70,000 డాలర్లు కాగా, ప్రవాసాంధ్రుల తలసరి ఆదాయం 1,26,000 డాలర్లుగా ఉందన్నారు. ఐరపా దేశాలు , ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, తైవాన్ లతో మొబిలిటీ, మైగ్రేషన్ (MMPA) భాగస్వామ్యాలను ఏర్పాటుచేయడంలో కేంద్రం తీసుకున్న చ‌ర్య‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు.

స్కిల్ డెవలప్ మెంట్, ఇనిస్టిట్యూషనల్ పార్టనర్ షిప్స్ కోసం నైపుణ్య భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడంలో ఏపీ ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందన్నారు. ఇందులో రష్యా, ఆస్టేలియా వంటి దేశాలతో కలిసి జాయింట్ ట్రైనింగ్ అండ్ ఎసెస్ మెంట్ పై ట్విన్నింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం అన్నారు. వివిధ పారిశ్రామిక సంస్థలు, ఉద్యోగార్థులను అనుసంధానించే ఏకీకృత వేదికగా నైపుణ్యం పోర్టల్ ను త్వరలో ప్రారంభించబోతున్నాం అని వెల్ల‌డించారు.

Also Read : Hero Vijay Deverakonda-Rashmika : న్యూయార్క్ లో త‌ళుక్కుమ‌న్న విజ‌య్, ర‌ష్మిక‌

Exit mobile version