తిరుపతి జిల్లా : ఇండియాస్ కూల్ క్యాపిటల్ గా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపును సంపాదించిందన్నారు మంత్రి నారా లోకేష్. 9 ప్రముఖ ఏసీ తయారీ సంస్థలు, 30కి పైగా కాంపోనెంట్, సరఫరా భాగస్వాములు, రూ.12వేల కోట్ల పెట్టుబడులు, వేగంగా విస్తరిస్తున్న హెచ్ వీఏసీ ఎకోసిస్టమ్.. 2027 నాటికి భారతదేశలో ఏసీ ఉత్పత్తిలో 60 శాతం ఏపీ నుంచే వస్తుందన్నారు.. 2028 నాటికి ఇది 80శాతానికి చేరుతుందని, ఇది కేవలం వృద్ధి మాత్రమే కాదు.. గ్లోబల్ పోటీ సామర్థ్యం. మనందరం కలిస్తే ఇది వంద శాతానికి చేరుతుందన్నారు. డేటా సెంటర్ల నిర్మాణం, పవర్ ఏఐలో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పోటీ నడుస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఈ రంగంలో ముందంజలో ఉందన్నారు. మనం కేవలం డేటా సెంటర్లకు ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే కాకుండా. వాటిని నడిపించే వ్యవస్థలను కూడా నిర్మించడమే మన లక్ష్యం అన్నారు.
డేటా సెంటర్లు కేవలం ప్రారంభం మాత్రమే. పూర్తి ఎకోసిస్టమ్ నిర్మించడమే లక్ష్యం. ప్రతి డేటా సెంటర్ కు అడ్వాన్స్ డ్ కూలింగ్ సిస్టమ్స్, హై ఎఫీషియన్సీ చిల్లర్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, ప్రిసిషన్ మానుఫ్యాక్చరింగ్ అవసరం అని అన్నారు లోకేష్. ఇవి లేకుండా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పని చేయదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డేటా సెంటర్లు పెరుగుతున్నకొద్దీ.. ఈ భాగాల కొరత కూడా పెరుగుతోందన్నారు. ది. దేశానికి నిజమైన విలువను సృష్టించే అవకాశం ఇక్కడే ఉందని, మనం ఈ డేటా సెంటర్ల కాంపోనెంట్స్ తయారీలో కీలక సరఫరాదారులుగా మారితే.. అది భారతదేశానికి గొప్ప వ్యూహాత్మక ప్రయోజనంగా మారుతుందని చెప్పారు మంత్రి. ఎకోసిస్టమ్ లో భాగంగా క్యారియర్ ఏపీని, శ్రీసిటీని ఎంచుకుందన్నారు. ఫార్మా రంగంలో దేశం ఏవిధంగా అగ్రగామిగా మారిందో.. అదేవిధంగా డేటా సెంటర్ పరికరాల తయారీలో కూడా దేశం ప్రపంచ నాయకత్వాన్ని సాధించ గలదని పేర్కొన్నారు. డేటా సెంటర్ కంపోనెంట్ తయారీ.. భారతదేశ తదుపరి ఫార్మా రంగం కావచ్చు అని ఆశా భావం వ్యక్తం చేశారు.
