Nara Lokesh : అమరావతి – మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని. తన నిర్వాకం కారణంగా, అహంకారం వల్ల ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నాడని సంచలన ఆరోపణలు చేశారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తిని పరామర్శించేందుకని వచ్చాడని, ముగ్గురు అమాయకులను చంపాడని ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్ (Nara Lokesh). తన పార్టీకి చెందిన కార్యకర్త కారు కింద పడితే కనీసం కారు దిగి చూసే మనసు కూడా ఆయనకు రాలేదన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా అని ప్రశ్నించారు.
Minister Nara Lokesh Shocking Comments on YS Jagan
ఒకవేళ ఆనాడు జరిగిన సంఘటనలో కారు దిగి హుటా హుటిన ఆస్పత్రికి తరలించి ఉంటే సదరు వ్యక్తి బతికి ఉండేవాడని అన్నారు నారా లోకేష్. ఇది ముమ్మాటికి జగన్ రెడ్డి చేసిన హత్యగానే భావించాల్సి ఉంటుందన్నారు. తాను భ్రమల్లో బతుకుతున్నాడని, ఆయనకు అంత సీన్ లేదన్నారు. తాము జన సమీకరణ చేయలేక కాదని, ప్రజలు ఇబ్బంది పడ కూడదనేది తమ ఆలోచన అని స్పష్టం చేశారు నారా లోకేష్.
వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు 164 మంది టీడీపీ కార్యకర్తలను చంపేశారని, అయినా అప్పుడే భయపడ లేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వమే తమదని, ఇంకొకరి కోసం ఎలా భయపడతామని నిలదీశారు. జగన్ రెడ్డి పదే పదే తనను టార్గెట్ చేస్తున్నాడని, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ సొల్లు కబుర్లు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆయనకు తన భయం పట్టుకుందంటూ ఎద్దేవా చేశారు నారా లోకేష్.
Also Read : Minister Bandi Sanjay Fired on KCR : కల్వకుంట్ల ఫ్యామిలీపై భగ్గుమన్న బండి
















