Nara Lokesh : విశాఖపట్నం : విశాఖపట్నం వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘణంగా జరుగుతోంది. ఇవాల్టితో ముగుస్తుంది. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున వివిధ దిగ్గజ ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, టెలికాం, తదితర రంగాలకు చెందిన కంపెనీల చైర్మన్ లు, వైస్ చైర్మన్లు, సిఈఓలు, మేనేజింగ్ డైరెక్టర్లు, కన్సల్టెంట్స్, ఔత్సాహికులు, ప్రతినిధులు , పెట్టుబడిదారులు, ఆంట్రప్రెన్యూర్స్, తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కృషి చేశారు.
IT Minister Nara Lokesh Invites
ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తో వారీ (WAREE) సంస్థ ఛైర్మన్ అంకితా జోషి, సిఓఓ శ్యామ్ సుందర్ రఘుపతి భేటీ అయ్యారు. .ప్రస్తుతం పరిశ్రమల ఏర్పాటుకు అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం నెలకొందని ఈ సందర్బంగా చెప్పారు. సుదీర్ఘ పాలనానుభవం గల డైనమిక్ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఏపీ పారిశ్రామిక రంగంలో పరుగులు తీస్తోందని అన్నారు. రెన్యువబుల్ పవర్, డేటా సెంటర్లు, బ్యాటరీ స్టోరేజి రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ చేసిన విన్నపానికి సానుకూలంగా స్పందించారు వారీ చైర్మన్, సీఈఓలు.
Also Read : AP Huge Investments : ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడుల వెల్లువ
