DIG Koya Praveen Important Update : బ‌స్సు ఘ‌ట‌న‌పై డీఐజీ కోయ ప్ర‌వీణ్ కామెంట్స్

41 మంది ప్ర‌యాణీకుల‌లో 20 మంది మృతి

Hello Telugu - DIG Koya Praveen Important Update

Hello Telugu - DIG Koya Praveen Important Update

DIG Koya Praveen : క‌ర్నూలు జిల్లా : క‌ర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న కావేరి వోల్వో బ‌స్సు ద‌గ్ధం ఘ‌ట‌న‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు క‌ర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్ర‌వీణ్‌ (DIG Koya Praveen). కల్లూరు మండలం చిన్నటేకూరు నాయకల్లు ఫ్లై ఓవర్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు డీఐజీతో పాటు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ క‌లెక్ట‌ర్ నూరుల్ క‌మ‌ర్. ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నటేకూరు నాయకల్లు ఫ్లై ఓవర్ మధ్య హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 41 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని చెప్పారు డీఐజీ.

DIG Koya Praveen Gives Key Update for Kurnool Bus Incident

24 వ తేది తెల్లవారుజామున 3 గంట‌ల నుండి 3-10 గంటల సమయంలో బైక్ ను ఢీకొనడంతో బస్సు నుండి ఇంధనం లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని అన్నారు కోయ ప్ర‌వీణ్‌. 21 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. మిగిలిన 20 మందిలో 11 మంది మృతదేహాలను గుర్తించడం జరిగిందన్నారు . మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన లో భాగంగా స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఎంపీలు శబరి, బస్తీపాటి నాగరాజు, ఎమ్మెల్యే గౌరు చరిత‌ ప్రమాద ఘటన స్థలానికి చేరుకుని ఆరా తీసి పరిశీలిస్తున్నారు.

Also Read : Collector Siri Important Update : బ‌స్సు ఘ‌ట‌న‌లో ప్ర‌యాణికుల‌ వివ‌రాలు ఇవే

Exit mobile version