Nara Bhuvaneswari : చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) చిత్తూరు జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆమె నాలుగు రోజులుగా కుప్పం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈ సందర్భంగా కస్తూర్బా స్కూల్ ను సందర్శించారు. అక్కడ విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ స్థానిక ప్రజలతో మమేకం అవుతున్నారు. మొదటి రోజు శాంతిపురం మండలం చెల్దిగానిపల్లి పర్యటనలో నారా భువనేశ్వరిని కలిసిన లక్ష్మమ్మ అనే బీసీ మహిళ తమ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించింది. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. ఆ వెంటనే భువనేశ్వరి లక్ష్మమ్మ ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేశారు. తాము ఎంతో ఆరాధించే బాబన్న భార్య భువనమ్మ తమ ఇంటికి రావడంతో లక్ష్మమ్మ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లకుండా పోయాయి.
Nara Bhuvaneswari Key Comments
నారా భువనేశ్వరిని సాదరంగా స్వాగతించి చీరను బహుకరించారు. వారి యోగక్షేమాలు కనుక్కుని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో భువనేశ్వరి ఈ సందర్బంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అల్పాహరం తీసుకుని శాంతిపురంలోని నివాసానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ తనను కలిసేందుకు వచ్చిన ప్రజలతో ముచ్చటించారు. రాష్ట్రంలో కూటమి పాలన ఎలా ఉందంటూ వాకబు చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ది కోసం రేయింబవళ్లు కష్ట పడుతున్నాడని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తున్నాడని చెప్పారు నారా భువనేశ్వరి.
Also Read : Harish Rao Fired on Congress Govt : ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడితే ఎలా..?


















