Nara Bhuvaneshwari : లండన్ : తను జీవితంలో ఈ స్థాయి దాకా ఎదుగుతానని, ఇక్కడి దాకా వస్తానని ఏనాడూ అనుకోలేదని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ గ్రూప్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari). లండన్ వేదికగా హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు. కంపెనీ తరపున మేనేజింగ్ డైరెక్టర్ ( ఎండీ) హోదాలో గోల్డెన్ పీకాక్ అవార్డు స్వీకరించారు నారా భువనేశ్వరి జాతీయ స్థాయిలో ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ ను ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఎంపిక చేసింది ఐఓడి సంస్థ. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సీఎం చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి.
Nara Bhuvaneshwari Comments
పురస్కారాలు స్వీకరించిన అనంతరం నారా భువనేశ్వరి ప్రసంగించారు. తనను వెన్నంటి ప్రోత్సహించిన తన భర్త, డైనమిక్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు, నా తనయుడు మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణిలకు ధన్యవాదాలు తెలిపారు. వారు లేక పోతే తాను లేనని అన్నారు. ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడికి వెళ్లినా, ఎంతగా సంపాదించినా చివరకు మిగిలేది మనం చేసిన సహాయం మాత్రమేనని అన్నారు. ఇవాళ తాము ఏర్పాటు చేసిన హెరిటేజ్ సంస్థ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించడం జరిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక, సంక్షేమ సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు నారా భువనేశ్వరి.
Also Read : CM Chandrababu Interesting Comments on Modi : మోదీ నాయకత్వం దేశానికి బలం : చంద్రబాబు















