Nandakumar Reddy Fired on Harish Rao : అవినీతి ఆరోప‌ణ‌లు అబ‌ద్దం : వైస్ ఛాన్స‌ల‌ర్

హ‌రీశ్ రావుపై నంద‌కుమార్ రెడ్డి ఫైర్

Hello Telugu - Nandakumar Reddy Fired on Harish Rao

Hello Telugu - Nandakumar Reddy Fired on Harish Rao

Nandakumar Reddy : హైద‌రాబాద్ : అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన యూనివ‌ర్శిటీగా పేరు పొందిన శ్రీ కాళోజీ నారాయ‌ణ రావు వైద్య‌, ఆరోగ్య విశ్వ విద్యాల‌యంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించి త‌మ వ‌ద్ద పూర్తిగా ఆధారాలు ఉన్నాయంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌పై తీవ్రంగా స్పందించారు కాళోజీ యూనివ‌ర్శిటీ ఉప కుల‌ప‌తి (వైస్ ఛాన్స‌ల‌ర్ ) నంద కుమార్ రెడ్డి (Nandakumar Reddy). ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న‌పై కావాల‌ని కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని వాపోయారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఆయ‌న నేరుగా హ‌రీశ్ రావును ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

Vice Chancellor Nandakumar Reddy Slams MLA Harish Rao

త‌న‌పై కావాల‌నే బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, ఇది ఏమాత్రం త‌గ‌ద‌న్నారు నంద కుమార్ రెడ్డి.
మాజీ మంత్రి హరీష్ రావు సైతం నాపై ఆరోపణలు చేయడం దారుణం అన్నారు. కాగా గతంలో హరీష్ రావు నియమించిన వైస్ ఛాన్స‌ల‌ర్లు , అధివ‌కారులు ఏం చేశారో తెలియదా అని ప్ర‌శ్నించారు. తాను సెర్చ్ కమిటీ ద్వారా ఎంపికై ఉప కుల‌ప‌తిగా అపాయింట్ అయి వ‌చ్చాన‌ని చెప్పారు. త‌ను ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు తాను రాజకీయ నాయకుల పైరవీలతో రాలేద‌ని, తెచ్చు కోలేద‌ని స్ప‌ష్టం చేశారు నంద కుమార్ రెడ్డి. యూనివర్సిటీ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాల‌ని కోరారు. తాను విచార‌ణ జ‌రిపితే పూర్తిగా స‌హ‌క‌రించేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు.

Also Read : Minister Kandula Durgesh Clear Instructions : గోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా చేప‌ట్టాలి

Exit mobile version