నాగేశ్వ‌రమ్మ‌కు భ‌రోసా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌రా

పోష‌ణ కోసం తన జీతం నుంచి ప్రతి నెలా రూ. 5 వేలు

hellotelugu-PawanKalyan

అమ‌రావ‌తి : అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. తాను ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. నాగేశ్వ‌ర‌మ్మ‌ను ప‌రామ‌ర్శించారు. అమ్మా నీ పెద్ద కొడుకుని వచ్చా, నిన్ను చూడడానికి వచ్చా, బాగున్నావా.. నీ ఆరోగ్యం ఎలా ఉంది.. నాలుగు రోజులుగా నిన్ను చూసేందుకు వద్దామంటే ఆధికారిక కార్యక్రమాల వల్ల వీలు పడలేదని అన్నారు. నీకిచ్చిన మాట కోసం ఈ రోజు పనులన్నీ వాయిదా వేసుకుని నీ కోసం వచ్చానంటూ మంగళగిరి నియోజకవర్గం లోని ఇప్పటం గ్రామానికి చెందిన వృద్ధురాలు ఇండ్ల‌ నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లిన సందర్భంగా ఆప్యాయంగా అక్కున చేర్చుకుని పలకరించారు. గత ప్రభుత్వ హయాంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్న అక్కసుతో ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతల సమయంలో గత పాలకుల దాష్టికాలకు ఎదురు నిలిచారు నాగేశ్వరమ్మ .

ఇదే స‌మ‌యంలో నా బిడ్డ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తాడు.. మీ బెదిరింపులకు భయపడం అంటూ రోడ్డెక్కారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ గ్రామానికి వెళ్లి అందరికీ భరోసా ఇచ్చారు. నాగేశ్వరమ్మ ఇంటి కొడుకుగా అండగా నిలుస్తాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ సందర్భంలో గెలిచిన తరవాత తన ఇంటికి రావాలని నాగేశ్వరమ్మ కోరారు. ఆమెకు ఇచ్చిన మాట మేరకు త‌న ఇంటికి వెళ్లారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త‌న‌కు పూర్తి భ‌రోసా ఇచ్చారు. రూ. ల‌క్ష ఇచ్చారు. ఆపై త‌న జీతం నుంచి ప్ర‌తి నెలా రూ. 5 వేలు ఇస్తాన‌ని హమీ ఇచ్చారు. ఇక నువ్వు ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా చీర , ఖ‌ర్చుల కోసం రూ. 50 వేలు ఇచ్చారు.

Exit mobile version