MLC Nagababu Alarming : వీర మహిళలకు తోబుట్టువుల్లా తోడుంటాం

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగ‌బాబు

hellotelugu-nagababu

Nagababu : అమ‌రావ‌తి – జనసేన వీర మహిళలు ప్రతీ ఒక్కరికీ తోబుట్టువుల్లా తోడుంటామని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శ కె.నాగబాబు (Nagababu) భరోసానిచ్చారు. మహిళలను అనాదిగా నాలుగు గోడలకే పరిమితం చేసిన పరిస్థితుల నుంచి నేడు విద్య, వ్యాపార, సాంకేతిక పరిజ్ఞానంలో మహిళలే ముందుండే స్థాయికి ఎదిగారని అన్నారు. ముఖ్యంగా రాజకీయ, సామాజిక అంశాల్లో మహిళా శక్తి చాలా కీలకంగా మారనున్నదని స్పష్టం చేశారు.

MLC Nagababu key Comments

ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన వీర మహిళలతో నాగబాబు కొణిదెల‌ సమావేశం అయ్యారు. ప్రతీ వీర మహిళ చెప్పిన సమస్యలను, సలహాలను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళతామని భరోసానిచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో వీర మ‌హిళ‌లు ఎంత‌గానో క‌ష్ట ప‌డ్డార‌ని కొనియాడారు. మీరు లేక‌పోతే పార్టీ లేద‌న్నారు. గ‌త జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో ఎన్నో ఇబ్బందులు ప‌డ్డార‌ని, కేసుల‌ను కూడా ఎదుర్కొన్నార‌ని పేర్కొన్నారు.

కానీ ఎక్క‌డా అధైర్య ప‌డ‌కుండా వీర మ‌హిళ‌లు ఒకే తాటిపైకి వ‌చ్చార‌ని, అన్నింటిని , ప్ర‌త్యేకించి ఎదుర్కొన్న తీరు అభినంద‌నీయ‌మ‌న్నారు. ప్ర‌స్తుతం కూట‌మి స‌ర్కార్ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని సూచించారు నాగ బాబు. ఈ కార్యక్రమంలో విశాఖ నార్త్ ఇంచార్జీ పసుపులేటి ఉషా కిరణ్, జీవీఎంసీలో జనసేన ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంత ల,క్ష్మీ, వీర మహిళా రీజినల్ కో ఆర్డినేటర్ నాగలక్ష్మి, దుర్గా, సుధ, శారణి దేవి, వీర మహిళలు పాల్గొన్నారు.

Also Read : TTD EO New Innovation : టీటీడీ సౌభాగ్యంకు విస్తృత ఏర్పాట్లు – ఈవో

Exit mobile version