Nagababu : అమరావతి – కోట శ్రీనివాసరావు అసాధారణమైన, అత్యుత్తమ ప్రతిభ కలిగిన నటులు అని పేర్కొన్నారు జనసేన ఎమ్మెల్సీ, ప్రముఖ నటుడు నాగబాబు కొణిదల. ఆయన మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఒక పెద్ద లోటు అని పేర్కొన్నారు. విలన్ పాత్రలో చాలా ప్రత్యేకంగా నటించారని, ఎన్నో భిన్నమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేకత కలిగి ఉన్నారని ప్రశంసించారు. అలాగే ఎన్నో ఉదాత్తమైన పాత్రలు పోషించిన ఆయన మరణం తనను కలిచి వేసిందన్నారు. ఆయన ఇక లేరన్న వార్త తెలియగానే తనకు కన్నీళ్లు ఆగలేదన్నారు నాగబాబు (Nagababu). ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
Nagababu Comments
ఇదిలా ఉండగా కోట శ్రీనివాస రావు సినీ ప్రస్థానం చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదుతో ప్రారంభమైంది. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా. విలన్ గా, కమెడియన్, తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా, పిసినారిగా, పోలీసుగా ఇలా అద్భుతమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం తర్వాత ఆ లోటును భర్తీ చేశారు.
నటనా పరంగా తెలుగునాట చెరిగిపోని ముద్ర వేశారు కోట శ్రీనివాసరావు. ఆయన నటన చిరస్మరణీయం..అజరామరం. సినీ కళామతల్లి ఉన్నంత వరకు తను వెలుగుతూనే ఉంటారు. ఓవైపు నటుడిగా ఇంకో వైపు రాజకీయ నాయకుడిగా ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలలో ముఖ్య భూమిక పోషించారు. తనకు ఎదురే లేదని చాటారు కోట శ్రీనివాసరావు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.
Also Read : Actor Babu Mohan – Kota Death : కోటన్నను కోల్పోయానన్న బాబు మోహన్



















