ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మోసం చేశాడు

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన న‌టి పూజిత పొన్నాడ

hellotelugu-PujithaPonnada

హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు , మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది న‌టి పూజిత పొన్నాడ‌. గత డిసెంబర్‌లో తాను యూకేలో ఉన్నప్పుడు, ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి సహ-దర్శకుడిగా పనిచేస్తున్న వ్యక్తి నన్ను సంప్రదించాడు. త్రివిక్రమ్ సినిమాలో ఒక పూర్తి నిడివి పాత్రలో నటించమని కోరారు. జనవరి 3న నేను హైదరాబాద్‌కు చేరుకున్నాను. అక్కడ లుక్ టెస్టులు, ఫోటోషూట్లు జరిగాయి; స్వయంగా త్రివిక్రమ్ గారే నన్ను ఈ పాత్ర కోసం ఖరారు చేశారు. రచయిత నాకు కథ మొత్తం వివరించారు. నా పాత్ర సినిమా ఆరంభం నుండి క్లైమాక్స్ వరకు ఉంటుందని, నారా రోహిత్‌తో కీలక సన్నివేశాలు, అంతే కాకుండా యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని చెప్పారు. నేను ఒప్పందంపై సంతకం చేసి, అడ్వాన్స్ కూడా తీసుకున్నాను.

మొదటి షెడ్యూల్‌లో భాగంగా ఐదు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నాను; ఇందులో నా పరిచయ సన్నివేశంతో పాటు నారా రోహిత్‌తో కలిసి నటించిన దృశ్యాలు కూడా ఉన్నాయి. అయితే, ఆ తర్వాత దాదాపు మూడు నెలల పాటు ఎటువంటి సమాచారం లేదని వాపోయింది పూజిత పొన్నాడ‌. నా పాత్ర నిడివిని తగ్గించబోమని హామీ ఇచ్చినప్పటికీ, నాకు తెలియకుండానే నా స్థానంలో ఒక సీనియర్ నటిని తీసుకున్నారని తర్వాత తెలిసింది.

నన్ను తొలగించారనే విషయాన్ని నేను అంగీకరించాను, కానీ థియేటర్లలో విడుదలైన సినిమాలో నా పాత్రకు సంబంధించిన ఒక్క సన్నివేశం మాత్రమే ఉండటం చూసి నేను షాక్‌కు గురయ్యానంటూ వాపోయింది . బహుశా తిరిగి చిత్రీకరించడానికి సమయం లేక పోవడం వల్లే పాత దృశ్యాలను అలాగే ఉంచేసి ఉంటారు. దానికి తోడు, సినిమాలో నా పేరు కూడా ఎక్కడా వేయలేదు. ఇంత ముఖ్యమైన పాత్ర ఇస్తామని నమ్మించి, చివరకు కేవలం ఒక్క సన్నివేశానికే పరిమితం చేయడం నన్ను మోసం చేసినట్లుగా అనిపిస్తోంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ నిల‌దీసింది పూజిత పొన్నాడ‌.

Exit mobile version