Murugadoss : తమిళనాడు – టాప్ ఇండియన్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ సంచలన కామెంట్స్ చేశారు. తను సల్మాన్ ఖాన్ తో తీసిన సికిందర్ మూవీ ఆశించిన మేర ఆడలేదు . బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా నటించినా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం మురుగదాస్ (Murugadoss) మదరాసీ మూవీ తీశాడు. ఇది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిట్ చాట్ చేశాడు. హీరో సల్మాన్ ఖాన్ ప్రవర్తన గురించి కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీనిపై ఇంకా సల్మాన్ ఖాన్ ఇంకా స్పందించ లేదు. సికిందర్ వైఫల్యం తనకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయాడు.
Director Murugadoss Shocking Comments on Salmaan Khan
దీనికి ప్రధాన కారకుడు హీరో సల్మాన్ ఖాన్ అంటూ బాంబు పేల్చాడు. ఆయనను టార్గెట్ చేయడం సినీ రంగంలో చర్చనీయాంశంగా మారింది. సల్మాన్ ఖాన్‌తో పనిచేయడం అంత సులభం కాదని పేర్కొన్నాడు మురుగదాస్. తనతో సినిమా తీయడం ఇబ్బందికరంగా ఉంటుందన్నాడు. తను ఉదయం పూట కనిపించడని ఆరోపించాడు. తరచుగా అర్ధరాత్రి కనిపిస్తాడని, ఆ సమయంలో ఎలా షూటింగ్ చేయాలని ప్రశ్నించాడు. సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను పగటిపూట ప్లాన్ చేశామనన్నాడు. సల్మాన్ ఖాన్ కారణంగా చీకటి పడిన తర్వాత కృత్రిమ లైట్ల కింద చిత్రీకరించాల్సి వచ్చిందని ఆరోపించాడు మురుగదాస్.
కాగా చివరి నిమిషంలో జరిగిన మార్పుల పరంపర కూడా సినిమా దాని అసలు దృష్టిని కోల్పోయేలా చేసిందన్నాడు. చాలా షాట్‌ల కోసం గ్రీన్ స్క్రీన్‌లను ఉపయోగించాల్సి ఉందని దర్శకుడు సూచించారు. ఇవన్నీ రష్మిక మందన్నతో కలిసి నటించిన సికందర్ కృత్రిమంగా కనిపించడానికి దోహద పడ్డాయన్నాడు.
Also Read : Popular Actress Anasuya : బిగ్ బాస్ లో పాల్గొనడం లేదు : అనసూయ


















