మూసీ పేరుతో వేల కోట్ల స్కాంకు సీఎం స్కెచ్

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి కేటీఆర్

hellotelugu-KTR

హైదరాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మూసీ నది ప్రాజెక్టు పేరుతో భారీ దందాకు తెర లేపాడంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మండిప‌డ్డారు. దాదాపు రూ. 1.50 లక్షల కోట్లతో చేపట్టిన ఈ మూసీ ప్రాజెక్టు, వాస్తవానికి ఒక ‘దోపిడీ’ ) ప్రాజెక్టుగా మారింద‌న్నారు. ఈ రోజు మేము స్వయంగా మూసీ నది తీరానికి వచ్చి, అక్కడ వేలాది మంది ప్రజలను కలిశామన్నారు. ఎవరినీ నిరాశ్రయులను చేయకుండా, ఎటువంటి అంతరాయం కలిగించకుండా, ఎటువంటి విధ్వంసం సృష్టించ కుండానే అదే ప్రాజెక్టును కేవలం 10వ వంతు ఖర్చుతో పూర్తి చేయవచ్చని తాము నిరూపించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు కేటీఆర్. పురపాలక పరిపాలన శాఖలో భాగంగా ఈ వివరాలన్నింటినీ ముఖ్యమంత్రికి , ప్రభుత్వంలోని ఆయన సహచరులకు తప్పక అందజేస్తామన్నారు. వారు దీనిని సమీక్షించవచ్చు అని పేర్కొన్నారు.

ఈ అంశాన్ని పునః పరిశీలించాల్సిన అవ‌స‌రం ఉందన్నారు కేటీఆర్. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని స్ప‌ష్టం చేశారు. మూసీ పునరుజ్జీవనానికి తాము అడ్డు చెప్ప‌డం లేద‌న్నారు. కానీ మూసీ పేరుతో రియ‌ల్ ఎస్టేట్ దందా చేస్తామంటే ఊరుకునేది లేద‌న్నారు . తాము వ్యతిరేకించేది కేవలం దోపిడీని, భూ కబ్జాలను , ప్రజలను నిరాశ్రయులను చేయడాన్ని మాత్రమేన‌ని పేర్కొన్నారు . కాబట్టి, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాలని తాము కోరుతున్నామ‌న్నారు కేటీఆర్. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మేము ఈ అంశాన్ని తప్పక లేవనెత్తుతామ‌ని చెప్పారు. అవసరమైతే తెలంగాణ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు కూడా చేపడతామని హెచ్చ‌రించారు. తెలంగాణ ఖజానాలోని ప్రతి ఒక్క రూపాయిని ఈ దోపిడీ బారి నుండి కాపాడేలా చ‌ర్య‌లు తీసుకోవ‌ల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఒక ‘శాశ్వత ఏటీఎం’గా మార్చు కోవడానికి రాహుల్ గాంధీ కాచుకుని కూర్చున్నార‌ని ఆరోపించారు.

Exit mobile version