ముంబై : శివసేన బాల థాకరే రాజ్యసభ సబ్యుడు సంజయ్ రౌత్ నివాసం వద్ద అనుమానాస్పద వాహనం తిరగడంతో కలకలం రేపింది. ఇప్పటికే ఎంపీ ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం 3.35 సంజయ్ రౌత్ బంగ్లా వేలుపల ఎంపీ బంగ్లా వెలుపల సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక కారు కనిపించింది. భాండూప్‌లోని నివాసం వద్ద భద్రతా పరమైన ఆందోళన తలెత్తినట్లు నివేదికలు వచ్చాయి. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయన ఇంటి వెలుపల బెదిరింపు సందేశాలు ఉన్న ఒక గుర్తు తెలియని కారు పార్క్ చేసి ఉండగా కనుగొన్నారు. ఈ వాహనాన్ని మొదట సంజయ్ రౌత్ మద్దతుదారులు గమనించారు. ముంబై పోలీసులకు సమాచారం వెంటనే అందించారు.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఎంపీ బంగ్లా వెలుపల సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వాగన్ఆర్ కారు కనిపించింది. ఆ వాహనంపై పేరుకు పోయిన మందపాటి దుమ్ము పొరపై బెదిరింపు సందేశాలు రాసి ఉన్నాయి. ఆ కారును చాలా రోజులుగా అక్కడే వదిలేసినట్లు సమాచారం. పక్క కిటికీపై ఉన్న ఒక సందేశంలో ఈరోజు హంగామా జరుగుతుంది. సరిగ్గా రాత్రి 12.00 గంటలకు బాంబు పేలుడు జరుగుతుంది అని రాసి ఉంది. వెనుక విండ్‌షీల్డ్‌పై ఉన్న మరో సందేశంలో సీఎస్‌టీలో బాంబు పేలుడు జరుగుతుంది అంటూ ఇంకోటి రాసి ఉండడంతో అప్రమత్తం అయ్యారు పోలీసులు. పోలీస్ టీమ్స్ , బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్) సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. బంగ్లా ప్రాంగణం, తోట మరియు చుట్టుపక్కల సందులతో సహా అన్ని చోట్లా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
