Chinta Mohan : ఏలూరు జిల్లా – కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Chinta Mohan) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కాం వాస్తవమేనని అన్నారు. ఇందులో పాల్గొన్న వారు ఎవరో తేల్చాలన్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా గ్రామాల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయని వాపోయారు. సర్పంచులు నిధులు లేక అల్లాడుతున్నారని ఆవేదన చెందారు. వీధి లైట్లు, రోడ్లు వేసుకునేందుకు డబ్బులు లేక, దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కూటమి సర్కార్ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు చింతా మోహన్. ప్రతిరోజూ ఏపీకి కంపెనీలు వస్తున్నాయంటూ ఊదరగొడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు నిద్ర పోతున్నారా అంటూ ప్రశ్నించారు.
Ex Union Minister Chinta Mohan Key Comments
ఇదే సమయంలో పాలకులు మారినా ఊర్లు, పట్టణాలు ఉన్న చోటనే ఉన్నాయన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పదేళ్ల క్రితం ఎలా ఉందో, ఇప్పటికీ అలానే ఉంది. అభివృద్ధి జరగక పోవడం దారుణమన్నారు. లిక్కర్ కేసులో ఎవరు ఉన్నా, ఎంత పెద్ద వాల్లైనా, వారికి శిక్షలు తప్పదన్నారు చింతా మోహన్. బిల్లులు లేకుండా, లిక్కర్ అమ్మకాలు జరిగాయని ఆరోపించారు. ఆల్ ఇండియా మొలాసిస్ బోర్డు కు తాను చైర్మన్ గా పని చేశానని, తనకు దాని పట్ల పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఒక బాటిల్ లిక్కర్ తయారీకి, ఇరవై, లేదా ముప్పై రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని అన్నారు. కానీ మార్కెట్లో భారీ రేట్లకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
పొలిటిషియన్లు, మ్యాన్ ఫ్రాక్చర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎక్సైజ్ అధికారులు డబ్బు దోచుకుంటున్నారని ఆరోపిచారు చింతా మోహన్.లిక్కర్ అమ్మకాలు వల్ల, భార్యా భర్తల మధ్య తగాదాలు, కుటుంబాల్లో విభేదాలు ఏర్పడ్డాయన్నారు. పేద ప్రజల లివర్, కిడ్నీలు చెడి పోతున్నాయని, దీంతో పాటు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని ఇంత జరుగుతున్నా సర్కార్ వ్యాపారం నిర్వహించడం మాను కోవడం లేదన్నారు.
Also Read : AP Govt Approved – APWUJ Thanks : ఏపీ సర్కార్ నిర్ణయం జర్నలిస్టుల సంతోషం
