Minister Parthasarathy Fired on Jagan : బ‌డుగుల గురించి మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ కు లేదు

గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసార‌థి

Hello Telugu - Minister Parthasarathy Fired on Jagan

Hello Telugu - Minister Parthasarathy Fired on Jagan

Minister Parthasarathy : మంగ‌ళ‌గిరి : బడుగుల వంచనలో జగన్ మహాఘనుడు అని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసార‌థి (Minister Parthasarathy) అన్నారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉంటుందో అన్నదే వైసీపీ వ్యవహార శైలిలా ఉందని అన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పుకునే వర్గాలపై జగన్ చూపే ప్రేమ కూడా అదే రకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఒక బీసీ నాయకుడు చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేయాల్సి ఉన్నా వైసీపీ అడ్డుకొని ఉండటాన్ని ఉదాహరించారు. అది బీసీల పట్ల వారి ప్రేమ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుందని మండిప‌డ్డారు. జగన్ పాలనలో ప్రభుత్వంలోని అన్ని ముఖ్య పదవులన్నీ, చైర్మన్ పోస్టులు, ముఖ్య సలహాదారుల పదవులు ఏకపక్షంగా అగ్రవర్ణాలకు, వారి సొంత సామాజిక వర్గానికి మాత్రమే ఇచ్చార‌ని ఆరోపించారు.

Minister Parthasarathy Slams YS Jagan

ప్రజలు ఈ విషయాలను మర్చి పోలేదని, చంద్రయ్య కుటుంబానికి ఒక మంచి పరిష్కారం రావాలనే సందర్భంలో ఎందుకు అడ్డుకుంటుందో వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడానికి, వారి సామాజిక గౌరవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు పరిశీలించాలన్నారు. వైన్ షాప్స్, మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు కోసం 10 శాతం రిజర్వేషన్లు కల్పించి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.. గౌడ సోదరుల ఆర్థిక స్థితిని బలోపేతానికి ప్రభుత్వం కృషి చేసిందన్నారు కొలుసు పార్థ‌సార‌థి.

Also Read : YS Sharmila Strong Demand : బ‌ల్క్ డ్ర‌గ్ ఏర్పాటు మానుకోవాలి : ష‌ర్మిల

Exit mobile version