MP Gurumurthy : తిరుపతి : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలం ఓలూరు రాయల చెరువు తెగి పోవడంతో పరిసర గ్రామాలైన కలత్తూరు, కలత్తూరు హరిజనవాడ, పాతపాలెం గ్రామాలు నీటి మునిగాయి. ఈ ఘటనపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి (MP Gurumurthy) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు డిల్లీలో ఉన్న ఎంపీ వెంటనే స్పందించారు. తిరుపతి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు . సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని సూచించారు. స్థానిక ఆర్డీవోతో కూడా మాట్లాడారు ఎంపీ. ఈ మేరకు తక్షణ సహాయక చర్యలకు గాను ఎంపీ నిధుల నుండి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
MP Gurumurthy Key Comments
పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు వెంటనే స్పందించి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు గురుమూర్తి. గ్రామాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందేలా చూడాలని సూచించారు. నీటమునిగిన ప్రాంతాల్లో పరిశుభ్రత చర్యలు తీసుకుని అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ విపత్తు కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు భయపడకుండా అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
Also Read : PM Modi Important Meeting : ప్రపంచ కప్ ఛాంపియన్లకు ప్రధాని ఆతిథ్యం

















