Popular Patel – MP Eatala Rajender : ఘ‌నంగా ప‌టేల్ 150 జ‌యంతి వేడుక‌లు

ప్ర‌తి ఒక్క‌రు ప‌టేల్ వేడుక‌ల్లో పాల్గొనాలి

Hello Telugu - Popular Patel - MP Eatala Rajender

Hello Telugu - Popular Patel - MP Eatala Rajender

MP Eatala Rajender  : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ 150వ జ‌యంతి వేడుక‌ల‌ను దేశ వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్నార‌ని, రాష్ట్రంలో, మ‌ల్కాజ్ గిరి లోక్ స‌భ నియ‌జ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి ఒక్క‌రు పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (MP Eatala Rajender). శుక్ర‌వారం శామీర్ పేట లోని ఎంపీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దేశం ఐక్యంగా సుభిక్షంగా ఉండడానికి ప‌టేల్ చేసిన త్యాగం, చేసిన కార్యదీక్ష, పట్టుదల, కమిట్మెంట్ ఈ తరాలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టింద‌ని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జ‌రుగుతుంద‌న్నారు. స్పోర్ట్స్ పర్సనల్స్ , వివిధ రంగాల్లో నిష్ణాతులు, సమాజహితం కాంక్షించే వారు, యువకులను ఇందులో భాగస్వామ్యులను చేస్తున్నామ‌ని తెలిపారు ఎంపీ.

MP Eatala Rajender Comments

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ర్యాలీ నిర్వహించబోతున్న‌ట్లు ప్ర‌కటించారు ఈట‌ల రాజేంద‌ర్. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు ఊరికే వచ్చినవి కావు అన్నారు. మనం ఎగరవేసే జెండా మామూలుది కాదన్నారు. వందల సంవత్సరాల పాటు లక్షలది మంది భరతమాత ముద్దు బిడ్డలు ప్రాణాలు త్యాగం చేశారని గుర్తు చేశారు . అండమాన్ లాంటి భయంకరమైన జైలల్లో జీవితం గడిపారు. వారి త్యాగాలు మరచి పోకూడదని ఇలాంటి కార్యక్రమాలు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వ‌హిస్తున్నార‌ని చెప్పారు. మన జెండా, మన దేశ భక్తి మనల్ని కలిపి ఉంచుతుందన్నారు. అనేక సంస్థానాల‌ల‌ను విముక్తి చేసి భారత దేశంలో విలీనం చేసిన మహనీయుడు పటేల్ అని కొనియాడారు . 15 ఏళ్ల నుండి 29 ఏళ్ల వయసు ఉన్నవారు QR కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు ఎంపీ.

Also Read : Minister Ponnam Prabhakar Important Update to Farmers : అన్న‌దాత‌ల‌కు పొన్నం ప్ర‌భాక‌ర్ భ‌రోసా

Exit mobile version