Eatala Rajender : హైదరాబాద్ – బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పూర్తిగా అబద్దమని, తప్పుల తడక అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడం దారుణమన్నారు. ఆ కమిషన్ నిలవదని పేర్కొన్నారు. తాజాగా ఈటల చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. కాగా కాళేశ్వరం కట్టిన సమయంలో తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడారు ఎంపీ రాజేందర్ (Eatala Rajender). సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వంపై. ప్రధానంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఫైర్ అయ్యారు.
Eatala Rajender Slams Kaleshwaram Report
పదే పదే లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం దారుణమన్నారు. ఇది అవగాహన రాహిత్యాన్ని సూచిస్తుందన్నారు ఎంపీ. ఎన్ని విచారణలు చేసినా లేదా ఎంత మందితో నిరాధారమైన ఆరోపణలు చేసినా , లేదా ఇంకెన్ని దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించినా నిలబడదన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్దంగా ఉన్నామని ప్రకటించారు ఈటల రాజేందర్. ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు చర్యలకు దిగడం తప్పా మరోటి కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి స్వంతంగా తాను నిర్ణయం తీసుకోలేదన్నారు. అది సమిష్టిగా కేబినెట్ ఆమోదం తెలిపితేనే సంతకం చేయడం జరిగిందన్నారు.
ఇదిలా ఉండగా అసెంబ్లీ సాక్షిగా పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టు పై బీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ రిపోర్టుపై పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. ఏకంగా 9 గంటలకు పైగా జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : Deputy CM Pawan Kalyan Interesting Update : ప్రతి నెలా రెండుసార్లు సమీక్ష చేస్తా
















