బీటెక్ ర‌వి జ‌ర జాగ్ర‌త్త : అవినాష్ రెడ్డి

త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా..?

hellotelugu-MPAvinashReddy

క‌డ‌ప జిల్లా : త‌మ పార్టీ గురించి, ప్ర‌త్యేకించి దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుటుంబం గురించి అస‌త్య ఆరోప‌ణ‌లు చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోమ‌వారం ఆయ‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మాట్లాడారు. టీడీపీ నేత బీటెక్ ర‌విపై మండిప‌డ్డారు. త‌న‌కు త‌మ‌ను విమర్శించేంత ద‌మ్ము లేద‌న్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం తగదని, ఇక నుంచి మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు . రూ. 12 కోట్లకు ఎమ్మెల్సీ టికెట్ అమ్మకోడానికి మాతో వచ్చి మాట్లాడిన వ్యక్తి మమ్మల్ని విమర్శించడం సిగ్గు చేటన్నారు . 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కడప జిల్లాలో ఒక ఎమ్మెల్సీగా ఉండి 12 కోట్లు ఇస్తే ఎమ్మెల్సీ టికెట్ వదులు కుంటానని వైసిపి వ్యక్తులతో ఢిల్లీలో వచ్చి మాట్లాడించిన వ్యక్తి బిటెక్ రవి అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

మా నాయకుడు జగన్ 12 కోట్లు వద్ద‌ని చెప్పాడ‌ని అన్నారు. విలువ‌లు లేని బీటెక్ ర‌వి వైఎస్ కుటుంబం గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వైయస్ కుటుంబం పై తప్పుడు కూతలు కూయడానికే ఉన్నారు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేసిన ప‌నులు ఏమిటో చెప్పాల‌ని నిల‌దీశారు ఎంపీ. పులివెందుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేసిన వైఎస్ కుటుంబంపై విమర్శలు చేయడం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Exit mobile version