MP Appalanaidu Fired YCP Govt : వైసీపీ పాల‌న‌లో ఉత్త‌రాంధ్ర‌ స‌ర్వ నాశ‌నం : ఎంపీ

జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగిన అప్ప‌ల‌నాయుడు

Hello Telugu - MP Appalanaidu Fired YCP Govt

Hello Telugu - MP Appalanaidu Fired YCP Govt

MP Appalanaidu : అమ‌రావ‌తి – గ‌త ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పూర్తిగా కుంటు ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఎంపీ అప్ప‌ల‌నాయుడు. ఇష్టానుసారంగా దోచుకొని నేడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారంటూ మండిప‌డ్డారు. ఒక్క వ్యక్తి కోసం రుషికొండకు బోడిగుండు కొట్టి రూ. 500 కోట్లు దుర్వినియోగం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టి అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు నిజాలను తెలుసుకొని ఉత్తరాంధ్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు ఎంపీ.

MP Appalanaidu Slams YCP Govt

ఉత్తరాంధ్ర వాసి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇవ్వడం ప‌ట్ల సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ , పీఎం మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. వైసీపీ పాలకుల అరాచకాలకు ఉత్తరాంధ్ర ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికారని.. ఉత్తరాంధ్రను దోపిడీ దౌర్జన్యాలకు అడ్డాగా మార్చి పీక్కు తిన్నారని ఆరోపించారు. శుక్ర‌వారం మంగ‌ళ‌గిరి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో అప్ప‌ల‌నాయుడు (MP Appalanaidu) మీడియాతో మాట్లాడారు.

కూటమి పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి నేడు పరుగులు పెడుతుందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రను జగన్ రెడ్డి ఉత్తత్తి ఆంధ్రాగా మార్చాడని అన్నారు. అభివృద్ధిని విస్మరించి ఉత్తరాంధ్ర వెనుకబడేలా చేశాడని మండిప‌డ్డారు. మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రలో అరాచకాలు, దౌర్జనాలు చేశారని. ప్రజలు భయపడి బ్రతికేలా చేశారన్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు చాలా గౌరవంగా బ్రతుకుతున్నారని , స్వేచ్ఛ‌గా జీవిస్తున్నార‌ని చెప్పారు ఎంపీ.

Also Read : Bomb Threats – Delhi Schools : ఢిల్లీలో 20కి పైగా స్కూల్స్ కు బాంబు బెదిరింపులు

Exit mobile version