Mothevari Love : ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. ఇంటర్నేషనల్ ఓటీటీలకు ధీటుగా దేశీయ సంస్థల ఓటీటీలు సైతం దూసుకు పోతున్నాయి. తాజాగా ప్రముఖ జీ సంస్థ మీడియా , ఎంటర్ టైనర్ రంగంలో కీ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే పలు వెబ్ సీరీస్ లను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా మోతేవారి (Mothevari Love) వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది అందరికీ అందుబాటులో ఉంటోంది. మోతెవారికి మంచి స్పందన లభిస్తోంది. దీనికి శివ కృష్ణ బుర్రా రచనతో పాటు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సీరీస్ లో సదన్న, విజయలక్ష్మమి, సుజాత, మురళీధర్ తో పాటు ఇతర కీలక పాత్రలు పోషించారు.
Mothevari Love Movie OTT Updates
జీ 5 ఈ మధ్యన ఏపీ, తెలంగాణకు చెందిన సంస్కృతి, నాగరికతలను ప్రతిబింబించేలా వెబ్ సీరీస్ లను రూపొందిస్తోంది. అనిల్ గీలా, వర్షిణి కూడా నటించిన మోతేవారి లవ్ స్టోరీ ఆదరణ పొందుతోంది. ఆగస్టు 8వ తేదీన ఇది జీ 5లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఏకంగా రెండున్నర లక్షల మందికి పైగా వీక్షకులను పొందింది. ఇంకా దీనిని ఆదరిస్తూనే ఉన్నారు. మోతెవారి ప్రేమ కథ వెబ్ సీరీస్ ని మధుర ఎంటర్ టైన్మంట్ , మై విలేజ్ షో బ్యానర్లపై మధుర శ్రీధర్, శ్రీకాంత్ శ్రీరామ్ లు నిర్మించారు. మరో పాత్రలో మురళీధర్ గౌడ్ కీ రోల్ పోషించడం విశేషం. గ్రామీణ ప్రాంత ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చరణ్ అర్జున్ పాటలు, సంగీతం ఈ వెబ్ సీరీస్ కు ప్రాణం పోశాడు. శ్రీకాంత్ అరుపుల సినిమాటోగ్రఫీ అందించాడు.
Also Read : Hero Rajinikanth Coolie : రజనీకాంత్ కూలీ సినిమా టికెట్ రేట్ల పెంపు
