Morning Health : మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ కొన్ని దినచర్యలు, ముఖ్యంగా ఉదయం (Morning) పూట చేసే కొన్ని తప్పులు కాలేయాన్ని బలహీనంగా మార్చే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ముఖ్యమైన నాలుగు అలవాట్లు ఇవే:
Morning Health – 1. అల్పాహారం తినకపోవడం
ఉదయం అల్పాహారం తినకపోవడం వల్ల శరీరం అవసరమైన శక్తిని పొందలేకపోతుంది. దీనివల్ల ఒత్తిడి హార్మోన్లు (కార్టిసాల్) పెరిగి కాలేయంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కనుక ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
2. ఖాళీ కడుపుతో మందులు లేదా సప్లిమెంట్లు తీసుకోవడం
అల్పాహారం తినకుండానే కొంతమంది నేరుగా మందులు లేదా ఆరోగ్య సప్లిమెంట్లు తీసుకుంటారు. ఇది కాలేయంపై భారం పెంచుతుంది. దీర్ఘకాలంలో ఇది కాలేయానికి నష్టం కలిగించవచ్చు. కాబట్టి ఏదైనా మందులు తీసుకునే ముందు తినడం మంచిది.
3. ఉదయం వ్యాయామం చేయకపోవడం
చాలామంది ఉదయం వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వరు. కానీ రోజూ కనీసం 20–30 నిమిషాలు నడక లేదా యోగా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది కాలేయం సహా శరీరంలోని అవయవాలకు మేలు చేస్తుంది.
4. అధికంగా డీటాక్స్ పానీయాలు తీసుకోవడం
డీటాక్స్ పేరుతో రోజులో అనవసరంగా ఎక్కువ పానీయాలు తాగడం కూడా కాలేయానికి మంచిది కాదు. సాధారణంగా నిమ్మరసం కలిపిన నీరు లేదా కలబంద రసం తాగడం ద్వారా కూడా శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేయవచ్చు.
గమనిక: పై సమాచారం ఇంటర్నెట్‌లో లభ్యమైన విశ్లేషణల ఆధారంగా,అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్యులను సంప్రదించండి.
Also Read : Monsoon Important Health Tips : వర్షా కాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి



















