Morning Habits : ఒక రోజు ఎలా సాగుతుందనేది ఉదయం దినచర్యలపై చాలా వరకు ఆధారపడి ఉంటుంది. నిద్రలేచిన వెంటనే మనం చేసే కొన్ని చిన్న చిన్న పనులు, ఆ రోజంతా మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం మన ఆచరణ సానుకూలంగా ఉంటే, ఆ ప్రభావం రోజంతా కనిపిస్తుందని వారు అంటున్నారు. జీవితశైలిలో చోటుచేసుకున్న కొన్ని అలవాట్లు మానసికంగా నెగటివ్ ఫీలింగ్‌కి దారితీయవచ్చు. అందుకే, ఉదయం (Morning) పూట తప్పక మానేయాల్సిన కొన్ని అలవాట్ల గురించి నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు.
Morning Habits – నిద్రలేచిన వెంటనే మొబైల్ ఫోన్ చూస్తే…
చాలామందికి నిద్రలేవగానే మొబైల్ తెరిచి సోషల్ మీడియా లేదా వార్తలు చూసే అలవాటు ఉంది. అయితే ఇది మెదడుపై మానసిక ఒత్తిడిని కలిగించడంతో పాటు, దినచర్యపై దృష్టి పెట్టలేనంతగా మన ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. ఉదయపు వేళలో చెడు వార్తలు చూడటం, నెగటివ్ సమాచారం తెలుసుకోవడం వల్ల ఆ రోజు మొత్తం మానసికంగా ముభావంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అల్పాహారం మానేయడం ఆరోగ్యానికి హానికరం
వీలులేని పరిస్థితుల్లో బ్రేక్‌ఫాస్ట్‌ను పక్కన పెట్టడం, ఆకలితో ఉండటం మెదడు శక్తిని తగ్గిస్తుంది. ఇది ఏకాగ్రతను దెబ్బతీయడంతో పాటు మానసిక స్థితిని అస్థిరం చేస్తుంది. రోజును ఉత్సాహంగా ప్రారంభించాలంటే, సమయానికి పోషక విలువలతో కూడిన అల్పాహారం తినడం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం నీరు త్రాగకపోవడం
ఒక మంచి ఆరోగ్యపు అలవాటు ఉదయం (Morning) ఖాళీ కడుపుతో నీరు తాగడం. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసి, చురుకుదనం పెంపొందిస్తుంది. నిద్రపోతున్న సమయంలో శరీరం నిర్జలీకృతం (డీహైడ్రేటెడ్) అవుతుండటంతో, నిద్రలేచిన వెంటనే నీటిని తాగటం ఎంతో అవసరం.
ఆలస్యంగా నిద్రలేవడం
నిద్ర అవసరం అయినా కూడా ఆలస్యంగా నిద్రలేవడం జడత్వానికి దారి తీస్తుంది. రోజంతా నీరసంగా ఉండేలా చేస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు, శారీరక చురుకుదనం కోసం పరిగణనీయమైన సమయానికి నిద్రలేచి, తగిన రొటీన్ పాటించాల్సిన అవసరం ఉంది.
సమస్యలపై తలపులు – రోజు మొత్తం చిరాకు
కొందరికి నిద్రలేచిన వెంటనే సమస్యల గురించి ఆలోచించే అలవాటు ఉంటుంది. ఇది మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఉదయం సమయంలో నెగటివ్ ఆలోచనలు మన రోజంతా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందువల్ల ఉదయాన్నే సానుకూలమైన ఆలోచనలతో, ధ్యానంతో లేదా సరళమైన వ్యాయామంతో రోజు ప్రారంభించాలి.
Also Read : Monsoon – Eating Ice Cream Danger : వర్షాకాలంలో మీకు ఐస్ క్రీమ్ తినే అలవాటుందా అయితే జాగ్రత్త



















