Montha Cyclone : అమరావతి : బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా మారింది. ఏపీలో మొంథా తుపాను (Montha Cyclone) తీవ్ర రూపం దాల్చింది. గంటకు 90 నుంచి 100 కీలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు సర్కార్ అప్రమత్తమైంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు సమీక్ష చేపట్టారు. ఈ అత్యవసర భేటీలో ఆయా జిల్లాల కలెక్టర్లకు తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తుపాను ప్రభావం అధికంగా ఉందన్నారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఇప్పటికే ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని, అలర్ట్ చేస్తున్నామన్నారు.
Montha Cyclone Sensational in AP
ముందస్తుగా సర్కార్ అత్యవసర నిధులను ఆయా జిల్లాలకు కేటాయించడం జరిగిందని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. కాకినాడ- మచిలీపట్నం మధ్య తీరాన్ని మొంథా తుపాను తాకిందన్నారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలిందన్నారు సీఎం. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 120 కిమీ, కాకినాడకి 110 కిమీ, విశాఖపట్నంకి 220 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు సీఎం. పూర్తిగా తీరం దాటడానికి 3-4 గంటల సమయం పడుతుందన్నారు. కోస్తా వెంబడి గంటకు 90-100 కిమీ వేగంతో ఈదుర గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Also Read : Minister Atchannaidu Clear Instructions : ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
