Hot Water : వర్షాకాలం అనేది చల్లని వాతావరణంతో మనసుకు ముద్దుగా అనిపించినప్పటికీ, ఈ కాలంలో ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాముఖ్యత ఇవ్వాల్సిన సమయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గోరువెచ్చని నీటి వినియోగం (Hot Water) శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో, జీర్ణక్రియను సులభతరం చేయడంలో ఎంతో ఉపయోగకరమని సూచిస్తున్నారు.
Hot Water – తేమ పెరిగిన వాతావరణం – వైరస్, బాక్టీరియా ప్రబలింపు
వర్షాకాలంలో (Monsoon) వాతావరణ తేమ పెరగడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లకు దారితీసే బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాపించేందుకు అనువుగా మారుతాయి. ఫలితంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గోరువెచ్చని నీటి (Hot Water) సేవనం శరీరాన్ని ఈ ముప్పుల నుంచి రక్షించగలదని పేర్కొన్నారు.
జీర్ణక్రియకు మేలు – శరీరం శుభ్రతకు తోడు
ఎయిమ్స్ (AIIMS)కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజి నిపుణులు డాక్టర్ అనన్య గుప్తా వెల్లడించిన వివరాల ప్రకారం, వర్షాకాలంలో గోరువెచ్చని నీరు తాగడం జీర్ణ వ్యవస్థను ఉత్తమంగా పనిచేసేలా చేస్తుంది. అంతేకాదు, శరీరంలో పేరుకుపోయిన విషతత్వాలను బయటకు పంపించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నివారణకు ఇది సహాయపడుతుందన్నారు.
శ్వాస సంబంధిత ఇబ్బందులకు ఉపశమనం
వాతావరణ మార్పుల కారణంగా వర్షాకాలంలో శ్లేష్మం పేరుకునే అవకాశం ఎక్కువ. గోరువెచ్చని నీరు గొంతును శుభ్రపరచడంతో పాటు శ్వాస మార్గాలను తెరిపిస్తూ, జలుబు, దగ్గు వంటి వ్యాధుల తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరానికి లోపల శుభ్రతను కలిగిస్తూ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉదయాన్నే తాగితే మరింత లాభం
ఉదయం నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. తేనె లేదా నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు జీవక్రియను మెరుగుపరచడంలో తోడ్పడుతుందని, దీని వల్ల శరీరం ఎనర్జీతో నిండిపోతుందన్నారు.
జాగ్రత్తలు పాటించాలి
గోరువెచ్చని నీరు ప్రయోజనాలున్నాయని మనం తెలుసుకున్నప్పటికీ, అది అధికంగా వేడి ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత గల నీరు గొంతు, జీర్ణ తంత్రాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందువల్ల తగిన ఉష్ణంతో ఉన్న గోరువెచ్చని నీటిని రోజులో రెండు నుంచి మూడు సార్లు తాగడం మంచిదని సూచిస్తున్నారు.
Also Read : Lemon Water Proven Facts : రోజు ఉదయం నిమ్మరసం తాగొచ్చా..ఎవరు తాగకూడదు



















