Popular Cricketer Siraj : ఫుడ్ బిజినెస్ లోకి సిరాజ్ మియా

జోహార్ఫా రెస్టారెంట్ స్టార్ట్ చేసిన క్రికెట‌ర్

hellotelugu-sirajopens

Siraj : హైద‌రాబాద్ – హైద‌రాబాద్ కు చెందిన ప్ర‌ముఖ క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ (Siraj) ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. న‌గ‌రంలోని బంజారా హిల్స్ రోడ్ నెంబ‌ర్ 3లో ఫుడ్ ల‌వ‌ర్స్ కోసం జోహార్ఫా అనే పేరుతో రెస్టారెంట్ ను ఓపెన్ చేశాడు. న‌గ‌ర వాసులు , ఆహార అభిమానులంతా ఇందులో తినేందుకు క్యూ క‌డుతున్నారు. జోహార్ఫాను గ‌త నెల జూన్ 24న గ్రాండ్ గా ప్రారంభించాడు. ఇది హైద‌రాబాదీల‌కు కొత్త ఆహార గ‌మ్య స్థానంగా మారింది.

Cricketer Siraj Starts Food Business

జోహ‌ర్ఫా ప్ర‌త్యేక‌త ఏమిటంటే విలాస వంతమైన భోజన అనుభవాన్ని అందించడానికి ఇది అనువుగా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ రెస్టారెంట్ లో అతిథులకు మొఘల్ శైలి అలంకరణ, వింటేజ్ లాంతర్లు , సాంప్రదాయ డిజైన్‌లతో రాజుల‌, ఆనాటి సాంస్కృతిక వైభ‌వాన్ని చాటి చెప్పేలా తీర్చిదిద్దారు. ఈ రెస్టారెంట్ లో హైదరాబాదీ బిర్యానీ, హలీమ్, కబాబ్‌లు, షావర్మా, మొఘలాయి, పర్షియన్, అరేబియన్, చైనీస్ వంటకాలు దొరుకుతున్నాయి.

సిరాజ్ తన సోదరుడితో కలిసి ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. హైదరాబాద్ నా హృదయంలో ఉందని పేర్కొన్నారు. ఈ న‌గ‌రం ప‌లు రుచుల‌కు ప్ర‌సిద్ది. అంతే కాదు ఇక్క‌డి సంస్కృతి భిన్న‌మైన‌ది. అన్ని కులాలు, మ‌తాల‌కు చెందిన వారంతా క‌లిసి క‌ట్టుగా ఉంటార‌ని అన్నాడు. అందుకే అంద‌రికీ న‌చ్చేలా, మ‌న‌సు దోచుకునేలా రెస్టారెంట్ ను ఏర్పాటు చేశామ‌న్నాడు . ప్రారంభ ధ‌ర రూ. 400 నుండి ఉన్నాయి. శాఖహారుల‌కు కూడా ఇక్క‌డ బిర్యానీ ఫేమ‌స్. ఈ రెస్టారెంట్ మ‌ధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఫుడ్, క్రికెట్ ల‌వ‌ర్స్ ఇంకెందుకు ఆల‌స్యం వెంట‌నే సంద‌ర్శించండి.

Also Read : Ex MP Keshava Rao Fired on BRS : బీసీల రిజ‌ర్వేష‌న్ల‌పై బీఆర్ఎస్ కు అవ‌గాహ‌న లేదు

Exit mobile version