టీమిండియా త‌దుప‌రి కెప్టెన్ సంజు శాంస‌న్

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మ‌హ‌మ్మ‌ద్ ఖైఫ్

hellotelugu-MohammedKaif

ముంబై : మాజీ క్రికెట‌ర్ మొహ‌మ్మ‌ద్ కైఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. నిన్న‌టి దాకా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొని దెబ్బ తిన్న పులిలా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కేవ‌లం 5 మ్యాచ్ లు మాత్ర‌మే ఆడాడు. ఆపై 321 ప‌రుగుల‌తో భార‌త జ‌ట్టు త‌ర‌పున ఏ క్రికెట‌ర్ సాధించ‌న‌న్ని ర‌న్స్ చేశాడు. ఆపై ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఈ బిగ్ టోర్న‌మెంట్ లో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ అవార్డుకు ఎంపిక‌య్యాడు. ఎంపిక క‌మిటీ త‌నను ఎందుకు ఎంపిక చేశామ‌న్న దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్ చెందిన ప్లేయ‌ర్ త‌న‌కంటే ఎక్కువ‌గా ర‌న్స్ చేసిన‌ప్ప‌టికీ సంజు శాంస‌న్ ఆడిన ప్ర‌తి ఇన్నింగ్స్ అద్భుత‌మ‌ని, కీల‌క‌మైన స‌మ‌యంలో త‌ను స‌త్తా చాటాడ‌ని తెలిపారు. అంతే కాదు క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో వెస్టిండీస్ తో త‌ను తొలి బంతి నుంచి మ్యాచ్ ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉన్నాడు.

ఆపై 97 ర‌న్స్ తో జ‌ట్టును సెమీస్ కు చేర్చాడు. ఆపై ఇంగ్లండ్ తో అత్యంత కీల‌క‌మైన ప‌రుగులు చేశాడు. త‌ను 89 ప‌రుగులు చేసి కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఇక అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జ‌ట్టు బౌల‌ర్ల‌ను ఏకి పారేశాడు. ఆపై క‌ళ్లు చెదిరే షాట్స్ ఆడాడు. మరోసారి 89 ర‌న్స్ చేసి జ‌ట్టుకు చిరస్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు. త‌ను ఆడిన ప్ర‌తి ఇన్నింగ్స్ సూప‌ర్ అని , మాట‌ల్లో వ‌ర్ణించ‌లేమ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా మొహ‌మ్మ‌ద్ కైఫ్ స్పందించాడు. ప్ర‌స్తుతం టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన అనంత‌రం త‌దుప‌రి కెప్టెన్ ఎవ‌రు అనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. సూర్య కుమార్ యాద‌వ్ త‌ర్వాత సంజు శాంస‌న్ పొట్టి ఫార్మాట్ లో భార‌త జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని, ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నాడు కైఫ్. తాజాగా త‌ను చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Exit mobile version