మ‌హిళ‌ల క‌ల‌ల‌ను ఛిద్రం చేసిన మోదీ

నిప్పులు చెరిగిన ఏఐసీసీ కార్య‌ద‌ర్శి వేణుగోపాల్

hellotelugu-KCVenugopal

త‌మిళ‌నాడు : ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై భ‌గ్గుమ‌న్నారు. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కోయంబత్తూరులో జ‌రిగిన ఎన్డీఏ స‌భ‌లో ప్ర‌సంగించారు. సోదరీమణుల కలలను మరెవరో కాదు, స్వయంగా ప్రధాని మోదీనే చిద్రం చేశారని ఆరోపించారు. మేము మహిళా రిజర్వేషన్లకు పూర్తిగా మద్దతు ఇస్తున్నామన్నారు. దయచేసి దీనిని వెంటనే అమలు చేయాల‌ని కోరారు. కానీ తమిళనాడు, కేరళ, ఒడిశా వంటి చిన్న రాష్ట్రాల సీట్ల సంఖ్యను తగ్గించాలన్న వారి ఎజెండా మాత్రం ఓడి పోయిందన్నారు.

మేము నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఓడించామన్నారు కేసీ వేణుగోపాల్. కానీ బీజేపీ మాత్రం మహిళా రిజర్వేషన్లను ఓడించిందన్నారు. డీలిమిటేష‌న్ బిల్లు పేరుతో మ‌హిళా బిల్లును తీసుకు వ‌చ్చార‌ని, కానీ వారి పాచిక‌లు పార‌లేద‌న్నారు. వారి కుట్ర‌ల‌కు పుల్ స్టాప్ పెట్టామ‌న్నారు. మహిళా రిజర్వేషన్లను ఒక రక్షణ కవచంగా వాడుకోవాలని చూస్తున్నారని మండిప‌డ్డారు. ప్రధాని మోదీకి తమిళనాడుకు వచ్చి, ఈ విషయాల గురించి మాట్లాడే ధైర్యం ఎలా కలిగింది అని ప్ర‌శ్నించారు కేసీ వేణుగోపాల్. ఆయన తమిళనాడు ప్రజలకు పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Exit mobile version